Chandrababu Tollywood : ఏనాడూ సహకరించలేదు, సినీ పరిశ్రమపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఏపీలో తీవ్ర వివాదంగా మారిన సినిమా టికెట్ ధరల అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. టాలీవుడ్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Chandrababu Tollywood : ఏనాడూ సహకరించలేదు, సినీ పరిశ్రమపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Chandrababu Tollywood

Updated On : January 11, 2022 / 8:06 PM IST

Chandrababu Tollywood : ఏపీలో తీవ్ర వివాదంగా మారిన సినిమా టికెట్ ధరల అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. టాలీవుడ్ ను ఉద్దేశించి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమపై ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ తెలుగుదేశం పార్టీకి సహకరించలేదని చంద్రబాబు వాపోయారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సహకారం ఇవ్వలేదన్నారు. అంతేకాదు, తాను సీఎంగా ఉన్నప్పుడు తనకు వ్యతిరేకంగా సినిమాలు తీశారని, అప్పుడు కూడా తాము ఏమీ అనలేదని చంద్రబాబు గుర్తు చేశారు. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు అన్న చంద్రబాబు..ఎవరి పని వారు చూసుకోవాలని సూచించారు. ఇప్పుడు అనవసరంగా టీడీపీని సినిమా టికెట్ల గొడవలోకి లాగుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

చిరంజీవి పార్టీ గురించి కూడా చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. 2008లో చిరంజీవి పార్టీ పెట్టకుండా ఉంటే 2009లో అధికారంలోకి వచ్చేవాళ్లమని చంద్రబాబు అన్నారు. అసలు టీడీపీ సీన్ మరోలా ఉండేదని చెప్పుకొచ్చారు. 2009 ఎన్నికల్లో చిరంజీవి వల్లే ఓడిపోయామని తేల్చారు చంద్రబాబు. అయితే… పార్టీ పెట్టకముందు, పార్టీ పెట్టిన తర్వాత కూడా చిరంజీవి నాతో బాగానే ఉన్నారని చంద్రబాబు స్పష్టం చేశారు.

YS Jagan : జగన్‌కు రిలీఫ్.. సాక్షిలో పెట్టుబడులపై అనుకూల తీర్పు

”సినీ పరిశ్రమ తెలుగుదేశం పార్టీకి సహకరించింది లేదు. అధికారంలో ఉన్నప్పుడు కూడా సహకారం లేదు. నేను సీఎంగా ఉన్నప్పుడు నాకు వ్యతిరేకంగా సినిమాలు తీశారు. చిరంజీవి పార్టీ పెట్టకుంటే అప్పుడే అధికారంలోకి వచ్చేవాళ్లం. చిరంజీవి పార్టీ పెట్టకముందు, పార్టీ పెట్టిన తర్వాత కూడా నాతో బాగానే ఉన్నారు. ఇప్పుడు కూడా బాగానే ఉన్నారు. రాజకీయంలో పోరాటం అనేది ఆటలో ఓ భాగం” అని చంద్రబాబు అన్నారు.

Work From Home: కొత్త ఆంక్షలు.. ఆఫీసులు మూసివేత.. మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్‌!

చిరంజీవి పార్టీని, సినీ పరిశ్రమను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లోనే కాదు సినీ పరిశ్రమల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయ, సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి.