Chandrababu : తొలిరోజు ముగిసిన చంద్రబాబు సీఐడీ విచారణ.. నిధుల దుర్వినియోగం, షెల్ కంపెనీలు, బ్యాంకు ఖాతాలపై ఆరా

స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ లో నిధుల దుర్వినియోగంపై చంద్రబాబును పలు రకాలుగా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. షెల్ కంపెనీలు, బ్యాంకు ఖాతాలపై సీఐడీ ఆరా తీసినట్లు సమాచారం.

Chandrababu : తొలిరోజు ముగిసిన చంద్రబాబు సీఐడీ విచారణ.. నిధుల దుర్వినియోగం, షెల్ కంపెనీలు, బ్యాంకు ఖాతాలపై ఆరా

Chandrababu CID Investigation

Chandrababu CID Investigation : స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో తొలిరోజు చంద్రబాబు సీఐడీ విచారణ ముగిసింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు విచారణ తొలిరోజు ముగిసింది. మార్నింగ్ సెషన్ లో 3 గంటల పాటు సీఐడీ అధికారుల విచారించారు. ఉదయం 10 గంటలకు సీఐడీ అధికారులు చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులోనే విచారణ చేయడం ప్రారంభించారు. ప్రతి గంటకు ఐదు నిమిషాల చొప్పున గ్యాప్ ఇచ్చారు.

మధ్యాహ్నం ఒంటి గంటకు భోజన విరామం ఇచ్చిన అధికారులు.. లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి విచారణ ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల సీఐడీ విచారణ కొనసాగింది. ఏడు గంటలపాటు మొదటిరోజు చంద్రబాబును ప్రశ్నించారు. రెండు రోజులపాటు సాగే విచారణలో 14 గంటలపాటు సీఐడీ అధికారులు చంద్రబాబును విచారించనున్నారు.

Chandrababu – CID : సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో చంద్రబాబు విచారణ

స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ లో నిధుల దుర్వినియోగంపై చంద్రబాబును పలు రకాలుగా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. షెల్ కంపెనీలు, బ్యాంకు ఖాతాలపై సీఐడీ ఆరా తీసినట్లు సమాచారం. సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ తో మీటింగ్ లపై కూడా చంద్రబాబును ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. రేపు కూడా చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు.