Chandrababu Naidu: రీజినల్ జోన్స్.. బాబు మరో అస్త్రం.. అందుకేనా?

రాజధాని పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే అమరావతి రాజధాని అభివృద్ధి చేస్తూనే ఏపీలో మూడు ప్రాంతాల ఈక్వల్‌గా డెవలప్ చేయాలన్న స్టాండ్‌తో బాబు ముందుకు రావడం హాట్ టాపిక్ అవుతోంది.

Chandrababu Naidu: రీజినల్ జోన్స్.. బాబు మరో అస్త్రం.. అందుకేనా?

chandrababu naidu

Updated On : December 1, 2025 / 8:14 PM IST

Chandrababu Naidu: థింక్‌ డిఫరెంట్. కొత్త ఆలోచనలు..సరికొత్త విజన్..ఎప్పకప్పుడు ఫ్యూచర్ ప్లాన్స్. ఇది సార్ చంద్రబాబు బ్రాండ్ అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. లేటెస్ట్‌గా ఏపీ సీఎం చేసిన ఓ ప్రకటన టాక్‌ ఆఫ్‌ ది పాలిటిక్స్‌గా మారింది. ఏపీ సమగ్రాభివృద్ధి కోసం ప్రత్యేకంగా జోన్ వ్యవస్థను తీసుకొస్తామని చెబుతున్నారు. బాబు నో మూడు జోన్లు అన్న మాట రావడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో వైసీపీ తెచ్చిన మూడు రాజధానుల ఫార్ములాకు కౌంటర్‌గానే జోన్ స్లోగన్ అందుకున్నారన్న టాక్ వినిపిస్తోంది.

మళ్లీ ఫ్యూచర్‌లో కూడా ఆర్థిక, న్యాయ, పరిపాలనా రాజధాని అని లేనిపోని రచ్చ లేకుండా..డెవలప్‌మెంట్‌ మోడల్‌తో జోన్ సిస్టమ్‌కు ప్రపోజల్‌ రెడీ చేస్తున్నారట. అభివృద్ధి కోసమే జోన్ వ్యవస్థ అని బాబు చెప్తున్నప్పటికీ..వైసీపీని పూర్తిగా కార్నర్ చేయడానికే అన్న చర్చ అయితే జరుగుతోంది. అయితే మూడు ప్రాంతాలను మూడు జోన్లుగా చేసి..స్పెషల్ బోర్డు..స్పెషల్ ఆఫీసర్లను కూడా పెట్టేందుకు అంతా సిద్ధమవుతోందట. (Chandrababu Naidu)

అభివృద్ధి పనులు, పెట్టుబడులు, ప్రాజెక్టులపై ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ.. ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం ఇంప్లిమెంట్‌ అయ్యేలా మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారట. విశాఖ, అమరావతి, రాయలసీమను ఆర్థిక జోన్లుగా డివైడ్ చేసి..ప్రతీ జోన్‌కు మూడు కమిటీలు ఉండేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. విశాఖ జోన్‌లోకి ఉత్తరాంధ్రలోని 9 జిల్లాలు..అమరావతి జోన్‌లోకి 8 జిల్లాలు, రాయలసీమ జోన్‌లోకి 9 జిల్లాలు రాబోతున్నాయి. రాయలసీమ జోన్‌కు తిరుపతి కేంద్రంగా ఉండబోతోంది. మూడు ఎకనామిక్ జోన్లకు కలిపి సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఓ స్టీరింగ్ కమిటీ కూడా ఉండేలా వ్యూహరచన చేస్తున్నారట.

Also Read: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి వారిని గెలిపించొద్దు: రేవంత్‌ రెడ్డి

అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకూడదనేదే తమ ఆలోచన అంటున్నారు చంద్రబాబు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రకటించారు. రీజనల్ బోర్డులతో అభివృద్ధి అన్ స్టాపబుల్‌గా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. ఏపీలో గతంలో ఉన్న 13 జోన్ల వ్యవస్థను మార్చి, మూడు ప్రధాన జోన్లుగా చేయాలనే ప్రతిపాదన చర్చలో ఉంది. 2024 ఎన్నికల్లో టీడీపీ మ్యానిఫెస్టోలో ఈ అంశాన్ని ప్రస్తావించారు.

ఏ జోన్‌లో ఏయే అభివృద్ధి పనులు?
ఇప్పుడు అమల్లోకి తెచ్చే ప్లాన్ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జోన్‌లో పోర్టులు, టూరిజం, ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్‌పై ఫోకస్ చేయనున్నారట. కోస్తా జోన్‌లో రాజధాని అమరావతి అభివృద్ధి, అగ్రికల్చర్, IT హబ్‌లు వంటి అంశాలు కీలకంగా కానున్నాయి. రాయలసీమ జోన్‌లో మ్యానుఫ్యాక్చరింగ్‌ సెక్టార్‌తో పాటు ప్రాజెక్టులు, ఇన్వెస్ట్‌మెంట్లను అట్రాక్ట్ చేసే వ్యూహం ఉందట. ప్రతి జోన్‌కు సెపరేట్ బడ్జెట్, మానిటరింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తామంటోంది సర్కార్.

పబ్లిక్‌ అటెన్షన్ గ్రాబ్ చేసేలా రీజనల్‌ బోర్డులపై టైమ్‌ చూసి లీకులు ఇచ్చారని అంటున్నారు. వైసీపీ మూడు రాజధానుల ఫార్ములా ఎలాగూ సక్సెస్ కాలేదు. కానీ కూటమి ప్రభుత్వం అమరావతి కేంద్రంగానే అభివృద్ధి చేస్తోందన్న విమర్శ ఉంది. అందుకే చంద్రబాబు రీజనల్ బోర్డుల ఏర్పాటుకు ప్లాన్ చేశారని అంటున్నారు. వైసీపీ మూడు రాజధానుల ఎజెండాకు కౌంటర్‌గా..జోన్‌ నినాదం ఎత్తుకున్నారని చెప్పుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతిలో డెవలప్‌మెంట్‌ను స్పీడప్ చేశారు.

రాజధాని పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే అమరావతి రాజధాని అభివృద్ధి చేస్తూనే ఏపీలో మూడు ప్రాంతాల ఈక్వల్‌గా డెవలప్ చేయాలన్న స్టాండ్‌తో బాబు ముందుకు రావడం హాట్ టాపిక్ అవుతోంది.

ఏపీలో అమరావతిని మాత్రమే అభివృద్ధి చేసి మిగిలిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్నారని వైసీపీ విమర్శలు చేయకుండా..అపోజిషన్‌కు అసలు చాన్సే ఇవ్వొద్దన్న ఆలోచనతో బాబు ఉన్నారట. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి..పెట్టుబడులు..ఒక్క మాటలో చెప్పాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ అన్నట్లుగా రీజనల్ బోర్డులను తెస్తున్నారట. బాబు చెబుతున్న మూడు జోన్ల నినాదం ఏపీ రూపురేఖలను మారుస్తుందా లేదా అనేది వేచి చూడాలి.