Chandrababu Wishes Jagan : సీఎం జగన్‌కు చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు

ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే జగన్ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

Chandrababu Wishes Jagan : సీఎం జగన్‌కు చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు

Chandrababu Wishes Jagan

Updated On : December 21, 2021 / 4:26 PM IST

Chandrababu Wishes Jagan : నేడు ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు అంతా బర్త్ డే విషెస్ చెబుతున్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రతిపక్ష నేతలు కూడా విషెస్ చెబుతున్నారు. ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చాలా సింపుల్ గా హ్యాపీ బర్త్ డే జగన్ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సీఎం జగన్ కు చంద్రబాబు విషెస్ చెప్పడం ఆసక్తికరంగా మారింది.

Hairfall: తక్కువ వయస్సులోనే జుట్టు ఊడిపోవడానికి కారణాలు

1972 డిసెంబర్ 21న జమ్మలమడుగులో జగన్ జన్మించారు. 49వ ఏట అడుగుపెట్టారు. జగన్ జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. రక్తదానం, అన్నదానం, మొక్కలు నాటడం, దుప్పట్లు, పండ్లు పంచడం వంటి కార్యక్రమాలను కార్యకర్తలు చేపట్టారు. పార్టీలు, వర్గాలకు అతీతంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు జ‌రిగాయి. ప‌లువురు నేత‌ల స‌మక్షంలో సీఎం జగన్‌ కేక్‌ కట్‌ చేశారు. వేదపండితులు ఆయనను ఆశీర్వదించారు. అనంతరం ఆయ‌న‌కు శ్రీవారి ప్రసాదాన్ని అందించారు.

Vitamin Pills : విటమిన్ మాత్రలు ఎవరికి అవసరమో తెలుసా?

జగన్‌ జన్మదిన వేడుకను రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు. జ‌గ‌న్‌కు ప‌లువురు ప్ర‌ముఖులు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు.

జగన్ కు ప్రధాని మోదీ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ‘ఏపీ సీఎం జగన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకు భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని, సంపూర్ణ జీవితాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు.