Srisailam Temple : శ్రీశైలంలో చార్టెడ్ ఫ్లైట్ కలకలం

గతంలోనూ ఆలయంపై డ్రోన్స్ కనిపించడంపై కలకలం రేగింది. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Srisailam Temple : శ్రీశైలంలో చార్టెడ్ ఫ్లైట్ కలకలం

Srisailam Temple

Updated On : May 4, 2023 / 8:03 PM IST

Srisailam Temple : నంద్యాల జిల్లాలోని శ్రీశైలం పుణ్యక్షేత్రంలో చార్టెడ్ ఫ్లైట్ కలకలం రేపింది. ఆలయ పరిసరాల్లో గుర్తు తెలియని చార్టెడ్ విమానం చక్కర్లు కొట్టింది. అయితే ఈ విషయం తమకు తెలియదని ఆలయ అధికారులు అంటున్నారు. గతంలోనూ ఆలయంపై డ్రోన్స్ కనిపించడంపై కలకలం రేగింది.

తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి దేవాదాయ శాఖ, పోలీసులకు సమాచారం లేదన్నట్లు తెలుస్తోంది.స్థానిక అధికారులకు గానీ, తహసీల్దార్ కు గానీ ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Srisailam Drone : శ్రీశైలంలో అర్ధరాత్రి డ్రోన్ కలకలం.. ఆలయంపై చక్కర్లు కొట్టిన డ్రోన్

గతంలో కూడా శ్రీశైలం ఆలయం చుట్టూ చార్టెడ్ ఫ్లైట్ చక్కర్లు కొట్టింది. తాజాగా మరోసారి ఆలయంపై చార్టెడ్ ఫ్లైట్ చక్కర్లు కొట్టడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.