టీడీపీ-జనసేన అభ్యర్థుల జాబితాపై హరిరామ జోగయ్య సంచలన కామెంట్స్

Harirama Jogaiah: రెండున్నరేళ్లు పవన్ ముఖ్యమంత్రి అని చంద్రబాబు ప్రకటించాలని, లేకుంటే..

టీడీపీ-జనసేన అభ్యర్థుల జాబితాపై హరిరామ జోగయ్య సంచలన కామెంట్స్

Harirama Jogaiah

Updated On : February 25, 2024 / 5:13 PM IST

టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామ జోగయ్య లేఖ రాశారు. సీట్ల సర్దుబాటులో పొత్తు ధర్మం జరగలేదని అన్నారు. చంద్రబాబును పవన్ కల్యాణ్ దేహీ అని అడుక్కోవలసిన పరిస్థితి ఎందుకని నిలదీశారు.

జనాభా ప్రాతిపదికన, సామాజిక వర్గాల వారీ కూడా న్యాయం జరగలేదని హరిరామ జోగయ్య తెలిపారు. నిన్న ప్రకటించిన 118 సీట్లలో కమ్మ 24, రెడ్లు 17, కాపు 15, బీసీలకు 25 సీట్లు ఇచ్చారని తెలిపారు. వాస్తవానికి బీసీలకు 50 శాతం, కమ్మలకు 4 శాతం, రెడ్లకు 6 శాతం సీట్లివ్వాలని అన్నారు.

జనసేనకు 24 సీట్ల పంపకం పట్ల జనసైనికులు సంతృప్తిగా లేరని హరిరామ జోగయ్య చెప్పారు. జనసేన పరిస్థితి ప్రజల్లో అంత హీనంగా ఉందా అని ప్రశ్నించారు. 50 నుంచి 60 సీట్లలో జనసేనకు గెలిచే అభ్యర్థులు ఉన్నారని తెలిపారు. జనసేన శక్తిని పవన్ కల్యాణ్ ఎందుకు అంత తక్కువగా అంచనా వేస్తున్నారో తెలియడంలేదని చెప్పారు. రెండున్నరేళ్లు పవన్ ముఖ్యమంత్రి అని చంద్రబాబు ప్రకటించాలని, లేకుంటే జనసైనికులు సంతృప్తి చెందరని అన్నారు.

Read Also: ఇలా చేసుకుంటూ పోతే ఊరుకునేది లేదు: మాజీ మంత్రి కేటీఆర్