Chevireddy Bhaskar Reddy : హమాలీగా మారిన వైసీపీ ఎమ్మెల్యే
రాయలచెరువు ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు.. వారికి హెలికాప్టర్ ద్వారా నిత్యావసర సరుకులు అందచేస్తున్నారు.

Chevireddy Bhaskar Reddy
Chevireddy Bhaskar Reddy : రాయలసీమలో వరద నీటిలో చిక్కిన పల్లెలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. మరికొన్ని పల్లెలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. ఇక రాయల చెరువు ప్రాంతంలో ప్రమాదం హెచ్చరికలు జారీచేయడంతో ఆ ప్రాంతం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఇక ఈ నేపథ్యంలోనే వారికి నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ సాయంతో నిత్యావసరాలను పునరావాస కేంద్రాల వద్దకు తరలిస్తున్నారు.
మంగళవారం 10 టన్నుల నిత్యావసర సరుకులతో రాయలచెరువు (Rayalacheruvu) ముంపుగ్రామాల ప్రాణాలకోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం వద్దకు హెలికాప్టర్ వచ్చింది. అందులోని సరుకులను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. తన అనుచరులతో కలిసి కిందకు దింపాడు. భుజాలపై మూటలు (Carrying essentials) మోస్తూ హమాలీలా మారిపోయారు. ఎమ్మెల్యే తెగువను చూసి అందరు మెచ్చుకుంటున్నారు.
చదవండి : Rayalacheruvu : ఇంకా ప్రమాదం అంచునే రాయల చెరువు
రాయలచెరువు కట్ట తెగిన చోట పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి. సిమెంట్ కంకరతో గండిని పూడ్చుతున్నారు అధికారులు. ఇక చెరువులో నీటిమట్టం క్రమంగా తగ్గుతూ వస్తుంది. 0.6 టీఎంసీ సామర్థ్యం కల రాయల చెరువులో మంగళవారం మధ్యాహ్నానికి 0.8 టీఎంసీల నీరు వచ్చి చేరింది. సామర్థ్యం కంటే 0.2 టీఎంసీల నీరు అధికంగా ఉండటంతో అధికారులు ఆందోళన చెందారు. ఇన్‌ఫ్లో తగ్గడం, అవుట్ ఫ్లో పెరగడంతో చెరువులోని నీరు క్రమంగా తగ్గుతూ వస్తుంది.