ప్రజలు మార్పు కోరుకున్నారు- వైసీపీ ఓటమిపై చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

ఎన్నికల్లో ఓడిపోయినా.. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు మేము అండగా ఉంటామని మోహిత్ రెడ్డి హామీ ఇచ్చారు.

ప్రజలు మార్పు కోరుకున్నారు- వైసీపీ ఓటమిపై చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

Chevireddy Mohith Reddy (Photo Credit : Facebook)

Updated On : June 8, 2024 / 9:53 PM IST

Chevireddy Mohith Reddy : తుడా ఛైర్మన్, టీటీడీ పాలక మండలి సభ్యుడి పదవికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రాజీనామా చేశారు. చంద్రగిరిలో ఓటమి తర్వాత తొలిసారి ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్ళలో ప్రజల కోసం కష్టపడ్డాం అని చెప్పారు. కరోనా టైంలోను ప్రజలను ఆదుకున్నాం అని తెలిపారు. రూ.980 కోట్లతో చంద్రగిరి నియోజకవర్గంలో కనీస సౌకర్యాలు కల్పించామని వెల్లడించారు. ప్రజల కోసం ఇంత చేసినా.. ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చూసి బాధేసిందని వాపోయారు.

ఫలితం ప్రతికూలంగా ఉన్నప్పటికీ.. ప్రజాతీర్పును గౌరవిస్తాను అని అన్నారు. ప్రజలు మార్పు కోరుకున్నారని మోహిత్ రెడ్డి చెప్పారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన టీడీపీ నేత పులివర్తి నానికి శుభాకాంక్షలు తెలియజేశారు మోహిత్ రెడ్డి. ప్రజల కోసం పులివర్తి నాని పని చేయాలని కోరారు. వైసీపీ ఓటమి తర్వాత మా కార్యకర్తలపై దాడులు జరుగుతుండడం బాధాకరం అని ఆయన వాపోయారు. ఎన్నికల్లో ఓడిపోయినా.. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు మేము అండగా ఉంటామని మోహిత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Also Read : రామోజీరావుని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు లేదు- పవన్ కల్యాణ్