Chicken Prices Increased: రికార్డు స్థాయిలో ధరలు.. మటన్‌తో పోటీకి సై అంటున్న చికెన్..
ఉమ్మడి కృష్ణా జిల్లాలో రికార్డు స్ధాయికి చికెన్ ధరలు చేరాయి. కేజీ స్కిన్ చికెన్ రూ. 340, స్కిన్ లెస్ చికెన్ రూ. 350పైనే ఉంది.

Chicken Prices
Chicken Prices: తెలుగు రాష్ట్రాల్లో కోడి ధరలు కొండెక్కాయి. రికార్డు స్థాయిలో చికెన్ ధర పలుకుతోంది. గణనీయంగా పెరిగిన ఉష్ణోగ్రతలతో కోళ్లు చనిపోవడం, డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవటం, దాణా ధరలు పెరగడంతో చికెన్ ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. దీనికితోడు గత రెండు రోజులుగా మృగశిర కార్తె నేపథ్యంలో చికెన్‌కు గిరాకీ పెరిగింది. ఈ కారణంగా కోడి ధరలు ఒక్కసారిగా రెట్టింపైనట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు మటన్ ధరలకు పోటీ పడుతుండటం గమనార్హం. దీంతో మాంసం ప్రియులు చికెన్ కొనుగోలుకు వెనుకడుగు వేస్తున్నారు. భాగ్యనగరంలో రిటైల్ మార్కెట్‌లో స్కిన్‌లెస్ చికెన్ ధర కిలో రూ. 310 పలుకగా.. కాలనీలు, బస్తీల్లోని చికెన్ దుకాణాల్లో రేట్లు మరింత మండిపోతున్నాయి.
Chicken : వార్నీ.. భార్య చికెన్ వండలేదని భర్త ఆత్మహత్య
స్కిన్ తో ఉన్న చికెన్ కూడా రూ. 260 నుంచి 280 వరకు విక్రయిస్తున్నారు. గత వారం రోజుల్లో కిలో చికెన్ ధరలు రూ.50 నుంచి 60 వరకు పెరిగినట్లు చికెన్ విక్రయదారులు పేర్కొంటున్నారు. మరోవైపు విజయవాడలోనూ చికెధరలు మండిపోతున్నాయి. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ధరల విషయంలో మటన్‌తో చికెన్ పోటీకి సై అంటుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో రికార్డు స్ధాయికి చికెన్ ధరలు చేరాయి. కేజీ స్కిన్ చికెన్ రూ. 340, స్కిన్ లెస్ చికెన్ రూ. 350పైనే ఉంది. ఇక బోన్‌లెస్ చికెన్ ధర రూ. 800పైనే పలుకుతుంది. నాటుకోడి లైవ్ రూ.550, నాటు కోడి చికెన్ రూ. 800 పైనే పలుకుతుంది.
Chicken Curry : కోడికూర కోసం గొడవ .. కొడుకును కొట్టి చంపిన తండ్రి
గతవారం రోజుల్లో రూ. 40 నుంచి 50 రూపాయల వరకు చికెన్ ధరలు పెరిగాయి. చికెన్ కోసం దుకాణాల వద్దకు వెళ్లి పేద, మధ్యతరగతి ప్రజలు పెరిగిన ధరలతో చికెన్ కొనుగోలు చేయలేమని వెనుదిరిగిపోతున్న పరిస్థితి ఉంది. రికార్డు స్ధాయిలో చికెన్ ధరలు పెరుగుతుండడంతో గిరాకీ తగ్గి వ్యాపారస్తులుసైతం డీలా పడుతున్నారు.