Rayachoti District Issue: రాయచోటిని జిల్లా చేస్తేనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
రైల్వే కోడూరు, రాజంపేట, మదనపల్లిలకు అభివృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని.. రాయచోటిని జిల్లాగా చేస్తేనే అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు

Srikanth Reddy
Rayachoti District Issue: రాయచోటినియోజకవర్గాన్ని ప్రత్యేక జిల్లా చేస్తేనే ఇక్కడ అభివృద్ధి సాధ్యమౌతుందని.. రాయచోటి ఎమ్మెల్యే, ప్రభుత్వం విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం రాయచోటి ప్రెస్ క్లబ్ లో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్లానింగ్ కమిటీకి ఇచ్చిన నివేదికల ఆధారంగా.. రాయచోటి అభివృద్ధికి కావాల్సిన అన్ని వసంతాలు ఉన్నాయి కాబట్టే జిల్లాగా ప్రకటించారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అందరికి ఆమోదయోగ్యమైన జిల్లాగా రాయచోటిని ప్రకటిస్తే.. పక్క నియోజకవర్గాల వారు ఎందుకు ఆందోళన చేస్తున్నారో అర్థం కావడం లేదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
Also read: Mother Children Suicide: చినగంజాంలో బిడ్డలతో సహా తల్లి బలవన్మరణం, మృతుల వివరాలు తెలుసుకున్న పోలీసులు
రైల్వే కోడూరు, రాజంపేట, మదనపల్లిలకు అభివృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని.. రాయచోటిని జిల్లాగా చేస్తేనే అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. అన్నమయ్య నడయాడిన రాజంపేటను జిల్లాగా ప్రకటించాలని చేస్తున్న నిరసనలపై శ్రీకాంత్ రెడ్డి స్పందిస్తూ..అన్నమయ్య ఏ ఒక్క ప్రాంతానికి పరిమితం కాదని అన్నారు. రాజంపేట జిల్లా కోసం ప్రయత్నించలేదంటూ ఎంపీ మిథున్ రెడ్డిని కొంతమంది హేళన చేస్తున్నారని..ఎంపీ మిథున్ రెడ్డి కూడా కమిటీ రిపోర్ట్ లను స్వాగతించారు..అయినా సరే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని శ్రీకాంత్ రెడ్డి హితవు పలికారు.
Also read: Rail Projects in AP: ఏపీలో రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వడం లేదు: కేంద్ర మంత్రి
రాయచోటి కరువు జిల్లా కావునా వెనుకబడిన జిల్లాను అభివృద్ధి చేయడం అందరి బాధ్యత అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయచోటికి మెడికల్ కాలేజి ఇవ్వలేదు.. భౌగోళికంగా రాయచోటి జిల్లాగా ఉండటం సమంజసమని శ్రీకాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. రాజంపేట జిల్లాగా కావాలని స్థానిక ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డి, జడ్పిటిసి అమర్నాథ్ రెడ్డి ప్రయత్నం చేశారుగానీ.. కమిటీ నిర్ణయం మేరకే జిల్లాల ప్రకటన జరిగిందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రాయచోటికి మెడికల్ కాలేజి ఇవ్వలేదు..ఆర్టీఓ కార్యాలయం రాజంపేటలో ఉంది, రాయచోటిని చులకనగా మాట్లాడం తగదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
Also read: AP PRC ISSUE: ఉపాధ్యాయ సంఘాలపై మండిపడ్డ జేఏసీ చైర్మన్లు