Karumuri Nageswara Rao : రైతుల కల్లాల దగ్గరికే వెళ్లి ధాన్యం కొనుగోలు-మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

రైతుల కల్లాల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి చెప్పారు. రైతులకు ఆలస్యం లేకుండా సకాలంలో డబ్బులు పడేలా..

Karumuri Nageswara Rao : రైతుల కల్లాల దగ్గరికే వెళ్లి ధాన్యం కొనుగోలు-మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

Karumuri Nageswara Rao

Updated On : April 22, 2022 / 8:58 PM IST

Karumuri Nageswara Rao : పౌరసరఫరాల శాఖపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో 26 జిల్లాల జేసీలు, డీఎంవో, డీఎస్ వోలు, అధికారులు పాల్గొన్నారు. రైతుల కల్లాల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి చెప్పారు. జిల్లా యూనిట్ గా తీసుకుని రైతులకు దగ్గరగా ట్రాన్స్ పోర్టు ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. రైతులకు ఆలస్యం లేకుండా సకాలంలో డబ్బులు పడేలా చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. ప్రజలకు పోషక ఆహారం కోసం పోర్టిఫైడ్ బియ్యం ఇస్తున్నాం అన్నారు.

పోర్టిఫైడ్ రైస్ నీటిలో కడిగినపుడు తేలుతాయని, ఆ బియ్యాన్ని ప్రజలు ప్లాస్టిక్ బియ్యంగా భావించవద్దని మంత్రి కోరారు. ప్రజలకు ఇస్తున్న బియ్యం క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడం అని మంత్రి తేల్చి చెప్పారు. ధాన్యం, రేషన్ విషయంలో ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం అన్నారు. 21 నుంచి నెల 10 రోజుల్లో ధాన్యం సొమ్ములు రైతులకు అందిస్తాం అన్నారు. రైతులకు ఆధార్ తో అనుసంధానమైన బ్యాంకు అకౌంట్లలో ధాన్యం డబ్బు జమ చేస్తున్నాం అని తెలిపారు. కొందరు రైతులకు 4 బ్యాంకు అకౌంట్లు ఉంటున్నాయని.. వేరొక అకౌంట్స్ లో ధాన్యం డబ్బులు పడటం వల్ల రైతులు తెలుసుకోలేకపోతున్నారని మంత్రి అన్నారు. ఇప్పటివరకు రైతులందరికీ ధాన్యానికి సంబంధించి చెల్లింపులు చేశామన్నారు. ఎక్కడా పెండింగ్ లేదని అన్నారు.

Ration Rice Cash Transfer : ఏపీలో రేషన్ కార్డుదారులకు అలర్ట్.. బియ్యానికి నగదు బదిలీ వాయిదా

రేషన్ కార్డుదారులకు నగదు బదిలీపైనా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పందించారు. రేషన్ కార్డుదారులకు నగదు బదిలీని ప్రస్తుతానికి పక్కన పెట్టామన్నారు. యాప్ లో సాంకేతిక లోపం వల్ల ప్రస్తుతానికి నగదు బదిలీ నిలిపివేశామన్నారు. నగదు బదిలీపై తర్వాత ఏమైనా నిర్ణయం తీసుకుంటే సమాచారం తేలియజేస్తామని మంత్రి వెల్లడించారు.