రాజధానిపై క్లారిటీ : మంత్రి బోత్స ప్రకటన

ఏపీ రాజధానిపై జగన్ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. రాజధానిని తరలించడం లేదని మంత్రి బోత్స సత్యానారయణ ప్రకటించారు. ఏపీ శాసనమండలిలో 2019, డిసెంబర్ 13వ తేదీ శుక్రవారం లిఖితపూర్వక ప్రకటన విడుదల చేశారు. టీడీపీ సభ్యులు పలు ప్రశ్నలు సంధించారు. మంత్రి బోత్స సమాధానం ఇచ్చారు. అమరావతి నుంచి రాష్ట్ర రాజధానిని మార్చడానికి ఏదైనా ప్రతిపాదన ఉందా అని టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. అమరావతే రాజధాని అని బోత్స చెప్పారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిపై తరలిస్తారన్న చర్చ జరిగింది. మంత్రి బోత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్స్ వినిపించాయి. రాజధానిని అక్కడే కొనసాగించాలని, వేలాది ఎకరాల భూములు ఇచ్చామని వెల్లడిస్తున్నారు. రాజధాని నిర్మాణ పనులను కొనసాగించాలని ఈ మధ్యనే సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. తాజాగా మంత్రి బోత్స లిఖిత పూర్వక ప్రకటనతో అమరావతిని అక్కడనే కొనసాగిస్తారా ? లేక ఇతర అంశాలు ఏవైనా ఉన్నాయా ? అనేది తెలియాలంటే..కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
* ఏపీ రాజధానిలో స్టార్టప్ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు సింగపూర్ ప్రకటించింది.
* అమరావతిపై జగన్ ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది.
* ఆరుగురు సభ్యులతో కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావు కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
* ప్రొఫెసర్ మహావీర్, అంజలీ మోహన్, శివానందస్వామి, కేటీ రవీంద్రన్, డాక్టర్ అరుణాచలం సభ్యులుగా ఉంటారు.
* రాజధాని అమరావతితో పాటు రాష్ట్రాభివృద్ధికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
* ఇండియా కొత్త మ్యాప్‌లో కేంద్రప్రభుత్వం ఏపీ రాజధాని పేరును ప్రస్తావించకపోవడం విమర్శలకు తావిచ్చింది.
* ఇటీవలే అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
Read More : కీలక పరిణామం : ఆయేషా మీరా భౌతికకాయానికి రీ పోస్టుమార్టం