Cm Chandrababu: రాజధాని మహిళలపై వ్యాఖ్యలు క్షమించరాని నేరం, వారిని వదిలేది లేదు- సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
మొత్తం మహిళా సమాజాన్నే అవమానించారని అన్నారు. నీచ సంస్కృతికి చెక్ పెట్టే బాధ్యత తీసుకుంటామని, మహిళల ఆత్మగౌరవానికి అండగా ఉంటామని సీఎం చంద్రబాబు అన్నారు.

Cm Chandrababu: ఓ మీడియా చానెల్ లో రాజధాని మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతున్నాయి. ఈ కామెంట్స్ పై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఏకంగా సీఎం చంద్రబాబు స్పందించారు. రాజధాని మహిళలపై వ్యాఖ్యలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఆడబిడ్డలను అవమానించిన వారిని ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మన తల్లులు, చెల్లెళ్లపై దారుణ వ్యాఖ్యలు క్షమించరాని నేరం అన్నారు చంద్రబాబు. ఇటువంటి వికృత పోకడలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
రాజకీయ, మీడియా ముసుగులో వికృత పోకడలను సహించేది లేదన్నారు. స్త్రీ జాతికి జగన్ క్షమాపణ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. జగన్ ఇప్పటికీ ఖండించకపోవడం విచారకరం అన్నారు. ఇదంతా రాజధానిపై విషం చిమ్మే కుట్రలో భాగమే అని చంద్రబాబు ఆరోపించారు. రాజధాని మహిళలపై నీచాతి నీచంగా మాట్లాడారని మండిపడ్డారు. మొత్తం మహిళా సమాజాన్నే అవమానించారని అన్నారు. నీచ సంస్కృతికి చెక్ పెట్టే బాధ్యత తీసుకుంటామని, మహిళల ఆత్మగౌరవానికి అండగా ఉంటామని సీఎం చంద్రబాబు అన్నారు.
Also Read: పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే ఎవ్వరినైనా వదులుకుంటా.. చంద్రబాబు వార్నింగ్
రాజధాని అమరావతిపై వ్యాఖ్యలతో మహిళలను అవమానించారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అక్కడ విలసిల్లిన బౌద్ధాన్నీ అవహేళన చేశారని మండిపడ్డారు. అమరావతి ప్రాంతానికి బలమైన చారిత్రక, ఆధ్యాత్మిక, బౌద్ధ ధర్మ నేపథ్యం ఉన్న విషయాన్ని విస్మరించ వద్దన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన వారిలో 32 శాతం మంది ఎస్సీ, ఎస్టీలు.. 14 శాతం మంది బీసీ రైతులు ఉన్నారని తెలిపారు. రాష్ట్ర రాజధాని మీద కుట్రలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.