Cm Chandrababu : తల్లికి వందనం రూ.15వేలు, రైతులకు రూ.20వేలు డబ్బులపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..

గత ప్రభుత్వం నిర్వాకం వల్ల పోలవరం ప్రాజెక్ట్ కు అదనంగా నిధులు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని సీఎం చంద్రబాబు వాపోయారు.

Cm Chandrababu : తల్లికి వందనం రూ.15వేలు, రైతులకు రూ.20వేలు డబ్బులపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..

Updated On : February 2, 2025 / 12:36 AM IST

Cm Chandrababu : తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి కీలక ప్రకటన చేశారు. తల్లికి వందనం అమలుకు అన్ని సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పిల్లలు స్కూల్ కి వెళ్లే లోపు పథకం అమలు చేస్తామని ఆయన చెప్పారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని తప్పకుండా ఇచ్చి రుణం తీర్చుకుంటామన్నారు చంద్రబాబు.

ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15వేలు..
”ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15వేలు ఇచ్చి ఆ తల్లికి అండగా నిలబడతామని హామీ ఇచ్చాను. అందుకే, దాని మీద కూడా కట్టుబడి ఉన్నాం. వీలైనంత తొందరలోనే ఇస్తాం. ఒకేసారా రెండుసార్లా ఎలా చేయాలో ఆలోచిస్తాం. రేపు సంవత్సరం జూన్ 2వ తేదీన పిల్లలు స్కూల్ కి వచ్చే పరిస్థితి వస్తుంది. ఆ సమయంలోపే మొదటి సంవత్సరంలోనే ఇవ్వడానికి అన్ని సన్నాహాలు ఆలోచిస్తున్నా. తప్పకుండా ఇచ్చి రుణం తీర్చుకుంటాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

Also Read : మీ జీతం ఎంత? ఎంత ట్యాక్స్ కట్ అవుతుంది? ఈ టేబుల్లో చూసుకోండి..

మూడు విడతల్లో డబ్బులు ఇచ్చే కార్యక్రమం..
అదే విధంగా మే నుంచి వీలైతే రైతు భరోసా కింద సాయం చేస్తామన్నారు. కనీసం 20వేలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి రైతు భరోసా కింద రూ.20 వేలు(కేంద్రం 6వేలు, ఏపీ ప్రభుత్వం 14వేలు) ఇస్తామన్నారు చంద్రబాబు. అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు.

2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తాం..
ఇక, పోలవరం ప్రాజెక్ట్ పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు చంద్రబాబు. గత ప్రభుత్వం ఏపీని నాశనం చేసిందని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్ట్ ను గంగంలో ముంచేసిందన్నారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల పోలవరం ప్రాజెక్ట్ కు అదనంగా నిధులు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని సీఎం చంద్రబాబు వాపోయారు. రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లే తమ ప్రభుత్వం లక్ష్యం అన్నారు చంద్రబాబు.

పెన్షన్ల వల్ల వృద్ధుల గౌరవం పెరిగింది..
”పెన్షన్ల వల్ల వృద్ధుల గౌరవం పెరిగింది. తల్లిని, తండ్రిని చూసుకోవడం భారత దేశం సంప్రదాయం. పెన్షన్ల పెంపు వల్ల ఒక భద్రత వచ్చింది. వారి జీవన ప్రమాణాలు పెరిగాయి. వారి జీవితంలో కూడా ఒక నమ్మకం, భరోసా తీసుకొచ్చాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించాం. పెన్షన్లు పెంచడమే కాకుండా అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించాం. పూటకు 5 రూపాయలకే భోజనం పెడుతున్నాం.

Also Read : ఈసారి బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ పక్కానా? ఆ కీలకమైన పోస్ట్ ఆమెకేనా?

పేద మహిళల అభ్యున్నతి కోసం ప్రతిక్షణం పరితపిస్తున్నాం. హైదరబాద్ అభివృద్ధిలో అడుగడుగునా నా శ్రమ ఉంది. రాజధాని అమరావతి అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేశాం. నా మాట నమ్మి అమరావతి కోసం రైతులు భూములు ఇచ్చారు” అని చంద్రబాబు తెలిపారు.