రాఖీ పండుగకు సీఎం చంద్రబాబు స్పెషల్ ప్లాన్.. అక్కాచెల్లెళ్లు వారి సోదరుల కోసం..

రాఖీలు కట్టే చెల్లెమ్మలకు ఇకపై అన్న నక్షత్రం పేరుకు తగ్గట్టుగా విత్తనాలు ఇస్తామని, ఈ ఏడాదిలోనే ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

రాఖీ పండుగకు సీఎం చంద్రబాబు స్పెషల్ ప్లాన్.. అక్కాచెల్లెళ్లు వారి సోదరుల కోసం..

Updated On : June 5, 2025 / 3:21 PM IST

CM Chandrababu Naiud: రాఖీలు కట్టే చెల్లెమ్మలకు ఇకపై అన్న నక్షత్రం పేరుకు తగ్గట్టుగా విత్తనాలు ఇస్తామని, ఈ ఏడాదిలోనే ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నక్షత్రం చూసుకుని అన్నకు రాఖీ కడితే చెట్ల పెంపకానికి ఉపయోగపడుతుందని అన్నారు. రాజధాని అమరావతి పరిధి అనంతవరం ఏడీసీఎల్ పార్కులో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ సందర్భంగా వన మహోత్సవం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారాయణతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అడవులను 37శాతానికి పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు.

 

ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి పెంచాలని సూచించారు. చెట్లు పెంచని వారికి గాలి పీల్చే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు. వచ్చే నాలుగేళ్లలో ఐదు కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకోవాలని, నాలుగు సంవత్సరాలలో మన రాష్ట్రంలో 37శాతం గ్రీన్ కవర్ రావాల్సి ఉందని, ఆ మేరకు ప్రతీఒక్కరూ ప్రయత్నించాలని కోరారు.

గత ప్రభుత్వానికి చెట్లు పెంచటం తెలియదు కానీ, నరకడం మాత్రo బాగా తెలుసు. ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో వెళితే కింద రోడ్డుపై చెట్లు నరికేవారు. చెట్లు నరికితే కొన్ని దేశాల్లో జైల్లో పెడతారు. చెట్లు నరికితే మనిషిని చంపినట్టేనని కొన్ని దేశాల్లో చట్టాలు ఉన్నాయి. రాయలసీమ ప్రాంతంలో హార్టికల్చర్ బాగా అభివృద్ధి చెందుతోంది. దీని పర్యావసానంగా ఇతర ప్రాంతాల్లో కూడా గ్రీన్ కవర్ పెరుగుతోందని చంద్రబాబు అన్నారు.

 

రాఖీలు కట్టే చెల్లెమ్మలకు ఇకపై అన్న నక్షత్రం పేరుకు తగ్గట్టుగా విత్తనాలు ఇస్తాం. ఈ ఏడాది లోనే ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చూడతాం. నక్షత్రం చూసుకుని అన్నకు రాఖీ కడితే చెట్ల పెంపకానికి ఉపయోగపడుతుందని చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరు ఇంట్లో రూఫ్ టాప్ గార్డెన్ లేదా కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చేపలు, చికెన్, ఇళ్ల లో నుండి వచ్చే వెస్ట్ తో రీసైక్లింగ్ కు ఉపయోగిస్తాము. నల్లమల అడవుల్లో విలువైన మూలికలు ఉన్నాయి.

ఎర్రచందనంతో పాటు నల్లమల అడవులలో ఉన్న వనమూలికలనూ కాపాడుకోవాలి. చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. వచ్చే మూడేళ్ల లో వెస్ట్ టూ ఎనర్జీ ప్లాoట్లు వస్తున్నాయి. వచ్చే ఏడాది నాటికి పూర్తి గా ప్లాస్టిక్ నిషేధిస్తాం. 175 నియోజక వర్గాల్లో నగర వనాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.