అలాచేస్తే ఎవర్నీ వదిలిపెట్టను.. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
గత ఐదేళ్ల పాటు కలెక్టర్లతో సమావేశమే పెట్టలేదు. గత ఐదేళ్ల పాలన ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇకపై ప్రతి మూడు నెలలకొసారి కాన్ఫరెన్స్ ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు.
CM Chandrababu Naidu : కలెక్టర్ కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు పనిచేయకపోయినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సోమవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. లక్ష్యాలకు అనుగుణంగా ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. ఈ కాన్ఫరెన్స్ చరిత్ర తిరగరాయబోతోందని చెప్పారు. ప్రజా వేదికలో కలెక్టర్ల సదస్సు పెట్టి ఆనాటి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజావేదిక కూలగొట్టేశారు. విధ్వంసం సృష్టించారు. గత ఐదేళ్ల కాలంలో విధ్వంసంతో పాటు.. పనిచేసే అధికారులను పక్కన పెట్టారు. బ్లాక్ మెయిల్ చేశారని చంద్రబాబు అన్నారు. మనం తీసుకునే నిర్ణయాల వల్ల వ్యవస్థలే మారుతాయి. మనమంతా కష్టపడితే 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉంటామని చంద్రబాబు తెలిపారు. గత ఐదేళ్ల పాటు కలెక్టర్లతో సమావేశమే పెట్టలేదు. గత ఐదేళ్ల పాలన ఎంత దారుణంగా ఎందో అర్ధం చేసుకోవచ్చు. ఇకపై ప్రతి మూడు నెలలకొసారి కాన్ఫరెన్స్ ఉంటుంది. నా పనితీరుపైన కూడా రివ్యూ ఉంటుంది. ఎవరు పనిచేయకపోయినా చర్యలు తప్పవు. నేను కూడా సమయపాలన పాటిస్తానని చంద్రబాబు అన్నారు.
Also Read : అమరావతికి మహర్దశ.. రాజధాని నిర్మాణంపై వేగంగా అడుగులు
ఏపీ ప్రతిష్టను జగన్ దిగజార్చాడు..
ఏపీ బ్యూరోక్రసి ఒకప్పుడు టాప్. ఇప్పుడు ఆంధ్రా బ్యూరోక్రసి అంటే ఏమి చేయలేరు అనే ముద్ర పడింది. ఏపీ ప్రతిష్టను జగన్ దిగజార్చాడు. భావితరాల భవిష్యత్ మార్చే బలం పబ్లిక్ పాలసీకి ఉంటుంది. అందరం నిబద్ధతతో పనిచేస్తే 2047కి ప్రపంచంలో నెంబర్ వన్ లో ఉంటాం. బ్రిటిష్ వాళ్లు కోహినూర్ డైమండ్ తీసుకెళ్లారు కానీ ఇంగ్లీష్ తీసుకువెళ్లలేక పోయారు. మన జీవితంలో ఇంగ్లీష్ భాగమైంది. ఈరోజు బ్యూరోకార్ట్స్ చేసే పని భావితరాలకోసం. కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే రాష్ట్రాన్ని పున:నిర్మాణంకోసం పనిచేస్తామని ప్రజలకు హామీ ఇచ్చాం. ఈ కాన్ఫరెన్స్ రాష్ట్ర అభివృద్ధికోసమని చంద్రబాబు అన్నారు. ప్రజలు మెచ్చేలా పాలన ఇవ్వాలి. ఇదే కూటమి ప్రభుత్వం ధ్యేయం. ప్రభుత్వం దారితప్పినప్పుడు కంట్రోల్ చేయాలి. నాయకుడిగా అది నా బాధ్యత. ఐఏఎస్ అవ్వడం ఓ కల. నిబద్ధతతో పనిచేయండి. అవి మీకు జీవితంలో గుర్తుండి పోతుంది. మీకోసం మీరు మార్క్ తయారు చేసుకోవచ్చు. సంకల్పం మాత్రమే కాదు.. సాదన కూడా చాలా ముఖ్యం.. పని చేయకపోతే చర్యలు తప్పవని చంద్రబాబు స్పష్టం చేశారు.
Also Rad : మేము సిద్ధంగా ఉన్నాం.. మీ సూచనలు చాలా ముఖ్యం.. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
1995 సీబీన్ ని మళ్ళీ చూస్తారు..
కలెక్టర్లు ఆఫీసులకు పరిమితం కావద్దు. ఫీల్డ్ విజిట్ ఉండాలి. రెండూ బ్యాలెన్సింగ్ ఉండాలి. క్షేత్ర స్థాయిలో మీరు వెళితే మీ ఆలోచన విధానం మారుతుంది. నేను ఇంకా స్పీడ్ పెంచలేదు. 1995 సీబీఎన్ ని మళ్లీ చూస్తారు. అప్పట్లో మంత్రులు పరుగులు పెట్టేవారని చంద్రబాబు అన్నారు. అంగన్ వాడీ సెంటర్లు, డ్రైయిన్లు తనిఖీలు చేస్తాను. హైదరాబాద్ ను నిర్మాణం చేసింది అధికారులు. కరెంట్, టాయిలెట్, గ్యాస్ కనీస అవసరాలు అందించాలి. గ్రామాల్లో రోడ్లు, నీరు, వీధి లైట్లు అందించాలి. ఉపాధి కల్పన చాలా ముఖ్యం. నదుల అనుసంధానం చేయాలి. దీని వలన జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కలెక్టర్లు ఇన్నోవిటివ్ గా పనిచేయాలని చంద్రబాబు సూచించారు.
Also Read : Pawan Kalyan – Vikram : డిప్యూటీ సీఎం అవ్వడం మాములు విషయం కాదు.. పవన్ పై విక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
10లక్షలకోట్ల రూపాయలు అప్పు ఉంది..
పది లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశాం. గత ప్రభుత్వంలో జరిగిన దారుణాలు, దౌర్జన్యాలు, భూకబ్జాలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు, వినతి పత్రాలు వస్తున్నాయని చంద్రబాబు అన్నారు. మొదటి క్యాబినెట్ లోనే జగన్ ప్రభుత్వ భూకబ్జాలపై దృష్టి పెట్టాం. భూమిలో పాతిపెట్టే సరిహద్దు రాళ్లపై బొమ్మ వేసుకునే ఆలోచన వచ్చిందంటే ఎంత ఘోరం. పాసు పుస్తకాలపై జగన్ బొమ్మలు ఏంటి పిచ్చికాకపోతే. సంక్షేమాన్ని అమలు చేస్తూనే సంపద సృష్టించాలి. వినూత్నంగా ఆలోచన చేయాలి. ఐఏయస్, ఐపీఎస్ లు వినూత్నంగా ఆలోచనలు చేయాలని చంద్రబాబు సూచించారు. జగన్ ప్రభుత్వం బటన్ నొక్కడం తప్పితే చేసిందేమి లేదు. ప్రతీనెల 1న పేదల సేవలో అనే కార్యక్రమంతో మనం అనుసంధానం కావాలి. జీరో పావర్టీ మా ప్రభుత్వం లక్ష్యం. మేము సాధారణ కుటుంబంలోనే పుట్టాం. మానవత్వంతో ఆలోచన చేస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది. సిబ్బంది పట్ల అమర్యాదగా ప్రవర్తించవద్దు. మీరు చేసే తప్పులు ప్రభుత్వంపై ప్రభావితం అవుతుంది. ఇది పొలిటికల్ గవర్నెన్స్. ఎవరూ నియంతలు కాదు. మీరు చేసిన మంచి పనులు మీకు గుర్తింపును ఇస్తాయని చంద్రబాబు అన్నారు. నా పర్యటనలో పరదాలు కట్టడం, చెట్లు నరికివేయడం, ట్రాఫిక్ నిలిపివేయడం చేయొద్దు. విసిబుల్.. ఇన్ విసుబల్ పోలీసింగ్ ఉండాలి. తప్పులు చేసినవారిని వదిలిపెట్టం చంద్రబాబు అన్నారు. 36 మందిని చంపేశామని ఢిల్లీ వెళ్లి ధర్నా చేశారు. 36 మంది సమాచారం ఇవ్వండి.. ఫిర్యాదులు చేయండి యాక్షన్ తీసుకుంటామని చెప్పాం. జగన్ విషప్రచారం చేస్తున్నారు. ఉద్యోగాల కల్పన మన ప్రియారిటీ అంటూ చంద్రబాబు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పేర్కొన్నారు.