Chandrababu : ఆ కారును చూసి మురిసిపోయిన చంద్రబాబు.. ‘నా పాత మిత్రుడు’ అంటూ ఎక్స్‌లో పోస్ట్.. లండన్‌కు సీఎం దంపతులు
Chandrababu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాతకారును చూసి మురిసిపోయారు. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
Chandrababu
Chandrababu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాతకారును చూసి మురిసిపోయారు. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మూడు దశాబ్దాల క్రితం చంద్రబాబు అంబాసిడర్ కారును ఉపయోగించారు. ఆ కారుతో ఆయనకు సుదీర్ఘ అనుబంధం ఉంది. అయితే, ప్రస్తుతం ఆ కారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉంచారు. శుక్రవారం పార్టీ కార్యాలయంకు వెళ్లిన చంద్రబాబు.. ఆ కారును చూసి గత స్మృతులను నెమరవేసుకున్నారు. ఆ కారుపై చేయివేసి ఫొటోలు దిగారు.. ఆ ఫొటోలను తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేసి.. నా పాత మిత్రుడితో అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
ఏపీ 09 జీ 393 నెంబర్ కలిగిన అంబాసిడర్ కారు మూడు దశాబ్దాల క్రితం చంద్రబాబు నాయుడు ఉపయోగించారు. ఇది చంద్రబాబు సొంత వాహనం. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ అంబాసిడర్ కారులోనే చంద్రబాబు రాష్ట్రం మొత్తం విస్తృతంగా పర్యటించేవారు. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. భద్రతా కారణాల దృష్ట్యా ఆధునిక వాహనాలను ఉపయోగిస్తున్నారు. అయితే, తన పాత అంబాసిడర్ కారును మాత్రం చంద్రబాబు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు.
చంద్రబాబు గతంలో ఉపయోగించిన ఈ అంబాసిడర్ కారు ఇన్నాళ్లు హైదరాబాద్ లో ఉంది. ఇటీవల మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంకు ఈ కారును తీసుకొచ్చారు. శుక్రవారం చంద్రబాబు నాయుడు టీడీపీ కార్యాలయంకు వెళ్లిన సమయంలో ఈ కారును చూశారు. తాను గతంలో వాడిన అంబాసిడర్ కారు వద్దకు వెళ్లిన చంద్రబాబు.. ఆ కారులో తాను చేసి ప్రయాణాలను గుర్తు చేసుకున్నారు. కారుపై చేయి వేసి ఫొటోలు దిగారు. ఆ ఫొటోలను తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసి నా పాత్ర మిత్రుడు అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
….. with my old friend! pic.twitter.com/VJbB9keeE3
— N Chandrababu Naidu (@ncbn) October 31, 2025
లండన్‌కు చంద్రబాబు దంపతులు..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరితో కలిసి లండన్ వెళ్లనున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ ఎండీగా ఉన్న భువనేశ్వరికి ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్’ (ఐఓడీ) సంస్థ ప్రతిష్టాత్మకమైన ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు’ను నవంబరు 4న లండన్‌లో ప్రదానం చేయనుంది. హెరిటేజ్ ఫుడ్స్‌కు ఎక్స్‌లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డును కూడా ఆమె అందుకోనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హాజరు కానున్నారు. ఇక వ్యక్తిగత పర్యటన అనంతరం చంద్రబాబు పలు కార్యక్రమాల్లో పాల్గోనున్నారు. పలువురు పారిశ్రామిక వేత్తలతోనూ భేటీ కానున్నారు. విశాఖ పట్టణంలో నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు లండన్ పారిశ్రామిక వేత్తలను సీఎం చంద్రబాబు ఆహ్వానించనున్నారు. సతీసమేతంగా ఇవాళ లండన్ వెళ్లనున్న చంద్రబాబు నాయుడు.. నవంబర్ 6వ తేదీన తిరిగి స్వదేశానికి తిరిగి రానున్నారు.
