CM Chandrababu: దగ్గుబాటి వెంకటేశ్వరరావు గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన సీఎం చంద్రబాబు
మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం..

CM Chandrababu Naidu Daggubati Venkateswara Rao
CM Chandrababu: మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖలోని గీతం వర్సిటీ ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. దగ్గబాటి గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తోడల్లుళ్లు. వీరిద్దరూ కుటుంబ కార్యక్రమాల్లో కలుస్తున్నా.. దాదాపు మూడు దశాబ్దాల తరువాత ఒకే వేదికపైకి వచ్చారు. ఈ కార్యక్రమంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాట్లాడిన అనంతరం చంద్రబాబు ఆయన్ను అభినందిస్తూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ దగ్గుబాటితో కలిసున్న రోజులను గుర్తు చేసుకున్నారు.
Also Read: HariHara VeeraMallu : హరిహర వీరమల్లు షూటింగ్ అప్డేట్.. అసెంబ్లీ సమావేశాలు అవ్వగానే.. మరో పక్క..
‘‘దగ్గుబాటి వెంకటేశ్వరరావు నా తోడల్లుడు. ఎప్పుడూ కూడా మా కుటుంబంలో ఆయన విశిష్టమైన వ్యక్తి. ఇద్దరం కూడా అన్నీ ఎన్టీఆర్ వద్ద నేర్చుకున్నాం. తెల్లవారేసరికి ఎన్టీఆర్ వద్దకు వెళ్లి ఆయన చెప్పిన పనులు పూర్తిచేసేవాళ్లం. అయితే, వెంకటేశ్వరరావు పుస్తకం రాస్తారని నేనెప్పుడూ అనుకోలేదు. ఆయన చెప్పినప్పుడు ఈ పుస్తకం మీరే రాశారా అని అడిగా. రచయిత కానటువంటి రచయిత వెంకటేశ్వరరావు. ఎవరూ చేయని సాహసాన్ని ఆయన చేశారు. ప్రపంచ చరిత్రలో ఆది నుంచి ఇప్పటి వరకు మొత్తం వివరాలను పుస్తకంలో పొందుపరిచారు. ఎన్ని కష్టాలున్నా సంతోషంగా కనిపిస్తారంటూ’’ చంద్రబాబు అన్నారు.