Chandrababu Naidu: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. మరో పదిరోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్
ఏపీలోని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు.

CM Chandrababu Naidu
Chandrababu Naidu: ఏపీలోని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. రెండు రోజులపాటు జరిగే కలెక్టర్ల సదస్సు మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మెగా డీఎస్సీపై క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. జూన్ నెలలో పాఠశాలల ప్రారంభం నాటికి నియామకం చేపట్టనున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
Also Read: AP: తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. వాళ్లకు స్కీం పక్కా..
మెగా డీఎస్సీ ద్వారా మొత్తం 16,347 పోస్టులను భర్తీ ప్రభుత్వం భర్తీ చేయనుంది. డీఎస్సీ నోటిఫికేషన్ ను ఎలాంటి చిక్కులు, అడ్డంకులు ఉండకుండా జారీ చేసేందుకు, భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
మెగా డీఎస్సీ ద్వారా మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనుంది. ఆయా జిల్లాల్లోని స్థానికులతోనే 80శాతం ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పాఠశాల విద్యా శాఖ పరిధిలో 13,661 పోస్టులు, ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 439, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 170, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 2024 ఖాళీలు ఉన్నాయి. అలాగే విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పరిధిలో 49, బాల నేరస్తులకు విద్యా బోధనకోసం 15 టీచర్ పోస్టులు ఉండనున్నాయి.