CM Jagan : ఆ జిల్లాలకు రూ.2కోట్ల నిధులిస్తున్నాం..ప్రతి కుటుంబానికి రూ.2,000 ఇవ్వండి : సీఎం జగన్

ఏపీలో భారీ వర్షాలు ప్రజా జీవనాన్ని అతలాకుతం చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులపైనా..కురుస్తున్న వర్షాలపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తర కోస్తా నుంచి ఏలూరు జిల్లా వరకు కలెక్టర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

CM Jagan : ఆ జిల్లాలకు రూ.2కోట్ల నిధులిస్తున్నాం..ప్రతి కుటుంబానికి రూ.2,000 ఇవ్వండి : సీఎం జగన్

Cm Jagan Give 2000 To Each Flood Victim Family

Updated On : July 12, 2022 / 5:10 PM IST

CM Jagan : ఏపీలో భారీ వర్షాలు ప్రజా జీవనాన్ని అతలాకుతం చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులపైనా..కురుస్తున్న వర్షాలపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తర కోస్తా నుంచి ఏలూరు జిల్లా వరకు కలెక్టర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. గోదావరికి ఈ ఏడాది ముందస్తుగానే వరదలు వచ్చాయని..దీంతో ఈ ఒక్క నెలలోనే 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చిందని తెలిపారు. రేపు ఉదయానికి వరద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటం కూడా గోదావరిలో వరద ప్రవాహం పెరగడానికి కారణమని అన్నారు.

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జగన్ సూచించారు. వరదల్లో ఏ ఒక్కరూ కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రాకూడదని..కంట్రోల్ రూమ్స్ సమర్థవంతంగా పని చేయాలని ఆదేశించారు.కూనవరం, చింతూరుల్లో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు… అమలాపురం, వేలూరుపాడు, వీఆర్ పురంలలో నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయని తెలిపారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాలకు తక్షణమే రూ.2కోట్ల చొప్పున నిదులు పంపిస్తున్నామని సహాయక శిబిరాల్లో అన్ని ఏర్పాట్లు బాగుండాలని సీఎం సూచించారు. స్వచ్ఛమైన తాగునీరు, మంచి ఆహారం అందించాలని చెప్పారు. ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని అన్నారు. సహాయక శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ. 2 వేలు ఇవ్వాలని… తక్షణ సాయంగా ఈ డబ్బు వారికి ఉపయోగపడుతుందని చెప్పారు. వరదల కారణంగా జరిగే నష్టాలపై రోజువారీ నివేదికలు పంపాలని ఆదేశించారు.