CM Jagan Mohan Reddy: టీడీపీ, జనసేనలపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు: చంద్రబాబు రాష్ట్ర ఖజానాను దోచుకెళ్లారని వ్యాఖ్య

రాష్ట్ర ఖజానాను దోచుకున్న చంద్రబాబు దొంగల ముఠా అంటూ సీఎం జగన్ ఘాటు విమర్శలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి..ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో

CM Jagan Mohan Reddy: టీడీపీ, జనసేనలపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు: చంద్రబాబు రాష్ట్ర ఖజానాను దోచుకెళ్లారని వ్యాఖ్య

Jagan

Updated On : April 7, 2022 / 2:16 PM IST

CM Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి..ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ఖజానాను దోచుకున్నచంద్రబాబు దొంగల ముఠా అంటూ సీఎం జగన్ ఘాటు విమర్శలు చేశారు. వాలంటీర్లకు వందనం పేరుతో సేవా పురస్కారాల అందజేత కార్యక్రమం నిమిత్తం సీఎం జగన్ గురువారం నరసరావుపేట జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఈసందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో బటన్ నొక్కగానే నేరుగా ప్రజల ఖాతాలో నగదు జమచేస్తున్నామని అన్నారు. ప్రతిపక్షాల నుద్దేశించి జగన్ మాట్లాడుతూ మన(పార్టీ ప్రకటించిన) పధకాలు ప్రజల్లో అమలు అవుతుంటే ఎల్లో పార్టికి డిపాజిట్లు రావని ఏడుపు కనిపిస్తుందంటూ వ్యాఖ్యానించారు.

Also read:Volunteer Fight: చీమకుర్తి మండలంలో మహిళతో వాగ్వాదానికి దిగి దాడి చేసిన వాలంటీర్: మహిళ మృతి

ప్రజలకు సంక్షేమ పధకాలు అందిస్తుంటే రాష్ట్రం శ్రీలంక అవుతుందని చంద్రబాబు అండ్ కో కొత్త ప్రచారాన్ని అందుకున్నారని, వారి మాదిరి చేస్తే అమెరికా అవుతుందట అని జగన్ విమర్శించారు. చంద్రబాబు అయన దొంగల ముఠా కలిసి రాష్ట్ర ఖజానాన్ని దోచుకువెళ్లారని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన వీళ్ళను మనషుల లేక రాక్షసులు అనాలా అంటూ సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రదాని మోదీతో తాను గంటసేపు బేటి అయ్యానని.. అయితే ఆసమయంలో మోదీ నాకు క్లాస్ పీకారంటూ ఎల్లో మీడియా ప్రచారం చేసిందని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. “ఆ సమావేశ సమయంలో గదిలో ప్రదాని మోదీ, నేను తప్ప ఎవ్వరు లేరు..వీరేమైనా మోదీ సోఫా కింద లేదా నా సోఫా కింద వున్నారా” అని జగన్ ఎద్దేవా చేశారు.

Also read:Cheating in Tirumala: ప్రత్యేక దర్శన టికెట్లు అంటూ సర్వదర్శన టోకెన్లు అంటగట్టిన దళారీలు: తిరుమలలో కొత్త తరహా మోసం

ప్రతిపక్షాల అసూయకు మందు లేదని అది మంచిది కాదని అన్న జగన్..త్వరగా బిపిలు, షుగర్ వచ్చి “టికెట్” తీసుకుంటారని వ్యాఖ్యానించారు. వారు తనతో యుద్ధం నేరుగా చేయడం లేదని..నేను మారీచులతో యుద్దం చేస్తున్నానని జగన్ అన్నారు. “గజ దొంగల ముఠా..నీతి లేదు, దర్మం లేదు..అదికారం తప్ప వేరే ఎజెండా లేదని..వీరు చెప్పే మాటలు విననే వినవద్దని చెబుతున్నా” అంటూ సీఎం జగన్ ప్రతిపక్షాల నుద్దేశించి వ్యాఖ్యానించారు. జగన్ వచ్చిన తరువాత మంచి జరిగిందా లేదా అనేది ప్రజలు ఆలోచించాలని..మంచి అయుతే ఆశీర్వదించండి..లేదంటే ద్వేషించండి అంటూ సీఎం జగన్ చెప్పుకొచ్చారు.

Also Read: AP New Districts : ఏపీలో కొత్త జిల్లాలకు కోడ్‌.. ఇక ఈ కోడ్ ద్వారానే కార్యక్రమాలన్నీ అమలు!