CM Jagan : ఏపీ వైద్యారోగ్యశాఖలో సాధారణ బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

కరోనా వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా ప్రైవేటు ఆస్పత్రులూ సిద్ధం ఉండాలన్నారు.

CM Jagan : ఏపీ వైద్యారోగ్యశాఖలో సాధారణ బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

Jagan

Updated On : December 27, 2021 / 7:26 PM IST

AP Medical Health Department : ఏపీ వైద్యారోగ్యశాఖలో సాధారణ బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫిబ్రవరి నాటికి ప్రతి ఆస్పత్రిలో ఉండాల్సిన సంఖ్యలో సిబ్బంది ఉండాలన్నారు. అప్పటిలోపు కొత్త రిక్రూట్ మెంట్ ను పూర్తి చేయాలని ఆదేశించారు. సోమవారం (డిసెంబర్27,2021) వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించారు. ఒమిక్రాన్ వ్యాప్తి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వైరస్ వ్యాప్తి నివారణ, ముందస్తు చర్యలపై ఉన్నతాధికారులతో చర్చించిన జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

కరోనా వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా ప్రైవేటు ఆస్పత్రులు కూడా సిద్ధంగా ఉండాలన్నారు. వ్యాక్సినేషన్‌ ఉధృతం చేయాలని, ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్‌ చేయాలని సీఎం ఆదేశించారు. ఫీవర్‌ సర్వే చేసే సమయంలోనే వ్యాక్సిన్ చేయించుకోని వారు ఎవరైనా ఉంటే.. వారికి టీకాలు వేయాలన్నారు.

Musi River : మూసీ కొత్త అందాలు..నదిపై వంతెనలు, అందమైన గార్డెన్లు, బోటింగ్

డేటాను పరిగణలోకి తీసుకుని ఆ మేరకు తగిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. క్రమం తప్పకుండా ఇంటింటికీ ఫీవర్‌ సర్వే తప్పనిసరిగా జరగాలని తెలిపారు. కోవిడ్‌ నివారణలో ఇది మంచి యంత్రాంగమని, టెస్ట్‌ ఎర్లీ, ట్రేస్‌ ఎర్లీ, ట్రీట్‌ ఎర్లీ పద్ధతుల్లో ముందుకెళ్లాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, పరిశీలన పటిష్టంగా కొనసాగాలన్నార. సచివాలయం స్థాయి నుంచి డేటా తెప్పించుకోవాలని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం బూస్టర్‌ డోస్‌ ప్రకటన నేపథ్యంలో అన్ని రకాలుగా సిద్ధం కావాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌తో పాటు దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, వృద్ధులపై బూస్టర్‌ డోసులో ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్ చెప్పారు.
ఆర్టీపీసీఆర్‌ పద్ధతిలోనే పరీక్షలు చేయాలని సీఎం జగన్ చెప్పారు. అలాగే విదేశాల నుంచి వచ్చే వారికి పరీక్షలతో పాటు వారిని ట్రేస్‌ చేయాలన్నారు. వారిపై క్రమం తప్పకుండా రెగులర్‌గా పరీక్షలు జరపాలన్నారు. పాజిటివ్‌ అని తేలితే ప్రైమరీ కాంటాక్ట్స్‌కు కూడా వెంటనే పరీక్షలు చేయాలన్నారు.