Independence Day 2023 : త్రివర్ణ పతాకం 140 కోట్ల భారతీయుల గుండె.. ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండా ఎగురవేసిన సీఎం జగన్
గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చామని తెలిపారు. గ్రామ వార్డు, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చామని పేర్కొన్నారు. గ్రామాల్లో విలేజ్ క్లీనిక్ లు, డిజిటిల్ లైబ్రరీలు తెచ్చామని వెల్లడించారు.

CM Jagan hoist national flag
Independence Day 2023 – CM Jagan : విజయవాడలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఇందిరాగాంధీ స్టేడియంలో సీఎం జగన్ జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ త్రివర్ణ జెండా 140 కోట్ల భారతీయుల గుండె అని పేర్కొన్నారు. వ్యవసాయం, పరిశ్రమ, సేవా రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించామని తెలిపారు. ఇంకా సాధించాల్సింది ఎంతో ఉందన్నారు. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చామని తెలిపారు. గ్రామ వార్డు, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చామని పేర్కొన్నారు.
గ్రామాల్లో విలేజ్ క్లీనిక్ లు, డిజిటిల్ లైబ్రరీలు తెచ్చామని వెల్లడించారు. ఏ ప్రభుత్వం తీసుకురాని గొప్ప మార్పు తీసుకొచ్చామని తెలిపారు. ఏ ప్రభుత్వమూ చేయని విధంగా సేవలు అందిస్తున్నామని తెలిపారు. గతంలో అడుగునా లంచాలు, వివక్ష ఉండేదని దాన్ని పూర్తిగా మార్చివేశామని చెప్పారు. లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
రూ.2 లక్షల 31 వేల కోట్లను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నామని వెల్లడించారు. సామాజిక న్యాయం నినాదం కాదు.. అమలు చేసే విధానం అని నిరూపించామని గర్వంగా చెప్పారు. సంక్షేమ పథకాలన్నీ అక్కాచెళ్లెమ్మల పేర్లపైనే ఇస్తున్నామని తెలిపారు. వికేంద్రీకరణను విధానంగా మార్చున్నామని తెలిపారు. వికేంద్రీకరణతో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించామని వెల్లడించారు. నాలుగేళ్ల పాలనలోనే అంటరానితనం రూపం మార్చుకుందని తెలిపారు.
Rahul Gandhi : ప్రతి భారతీయుడి గొంతుగా భారత్ మాత…రాహుల్ గాంధీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
పేదలను అణచివేస్తున్న ధోరణులపై యుద్ధం ప్రకటించామన్నారు. పేదల ఇళ్లను అడ్డుకోవడం కూడా అంటరానితనమేనని స్పష్టం చేశారు. పేదల సహనాన్ని పరీక్షించడం కూడా అంటరానితనమే అవుతుందన్నారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా కోర్టుల్లో కేసులు వేశారని పేర్కొన్నారు. లబ్ధిదారుల జాబితాలో అత్యున్నత విధానం అవలంభిస్తున్నామని తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పిన అన్ని హామీలను అమలు చేశామని అమలు చేశామని పేర్కొన్నారు.
రైతులకు ప్రతి ఏటా రైతు భరోసా అందిస్తున్నామని తెలిపారు.రైతన్నల చేయి పట్టుకుని నడిపిస్తున్నామని చెప్పారు. ఏ సీజన్ లో పంట నష్టం జరిగితే అదే సీజన్ లో పరిహారం ఇస్తున్నామని తెలిపారు. రైతులకు నాణ్యమైన 9 గంటల కరెంట్ అందిస్తున్నామని వెల్లడించారు. సమగ్ర భూ సర్వేలో రికార్డులు అప్ డేట్ చేశామని తెలిపారు. భూ వివాదాలకు స్వస్తి పలికి రైతన్నలకు మేలు చేశామని పేర్కొన్నారు.
ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్నామని తెలిపారు. నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవుకు రెండో టన్నల్ పూర్తి చేశామని వెల్లడించారు. కాల్వల సామర్థ్యాన్ని పెంచి పులిచింతల, గండికోట, చిత్రావతి, పైడిపాలెం, బ్రహ్మసాగర్ ను పూర్తి స్థాయిలో నింపగలిగామని తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.