CM Jagan : సబ్‌స్టేషన్లు, విద్యుత్‌ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన సీఎం జగన్

14 జిల్లాల్లో విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ బలోపేతం అవుతోందన్నారు. 28 సబ్‌ స్టేషన్లలో కొన్నింటిని ప్రారంభించామని, మరి కొన్నింటిని పనులు ప్రారంభిస్తామని చెప్పారు.

CM Jagan : సబ్‌స్టేషన్లు, విద్యుత్‌ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన సీఎం జగన్

CM Jagan (8)

CM Jagan – Substations and Power Projects : ఏపీ సీఎం జగన్ ఇంధన రంగానికి సంబంధించి పలు ప్రారంభోత్సవాలు, పలు ప్రాజెక్టుల పనులకు వర్చువల్‌ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. మంగళవారం సబ్‌స్టేషన్లు, విద్యుత్‌ ప్రాజెక్టులకు కలిపి మొత్తంగా సుమారు రూ.6600 కోట్ల విలువైన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఇది కాకుండా పునరుత్పాదక విద్యుత్‌ రంగంలో హెచ్‌పీసీఎల్‌తో రూ.10వేల కోట్ల విలువైన ప్రాజెక్టుపై అవగాహనా ఒప్పందం కుదిరింది.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు మరో మంచి కార్యక్రమం చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. 14 జిల్లాల్లో విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ బలోపేతం అవుతోందన్నారు. 28 సబ్‌ స్టేషన్లలో కొన్నింటిని ప్రారంభించామని, మరి కొన్నింటిని పనులు ప్రారంభిస్తామని చెప్పారు.

Telangana Assembly Election 2023 : ఇక ఓటర్లకు అభ్యర్థుల ఫోన్ కాల్స్.. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఎన్నికల ప్రచారం

గోదావరి ముంపు ప్రాంతాల్లో చింతూరు, వీఆర్‌పురం, ఎటపాక తదితర ప్రాంతాల్లో ఇటీవలే తిరిగినప్పుడు సబ్‌స్టేషన్లే లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని అక్కడి వారు చెప్పారని తెలిపారు. ఆ సమస్యను పరిష్కరిస్తూ.. సబ్‌స్టేషన్లను ప్రారంభిస్తూ అక్కడి ప్రజలకు అంకితం చేస్తున్నామని చెప్పారు. 12 సబ్‌స్టేషన్లను ఇవాళ ప్రారంభిస్తున్నామని, 16 సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు.

ట్రాన్స్‌మిషన్‌ కెపాసిటీని విస్తరించుకుంటూ నాణ్యమైన విద్యుత్‌ ప్రతి గ్రామానికి ప్రతిరైతుకు ఇచ్చే వ్యవస్థను క్రియేట్‌ చేస్తున్నామని తెలిపారు. రైతులకు 9 గంటలపాటు పగటిపూటే ఉచిత విద్యుత్‌ ఇవ్వాలన్న ఉద్దేశంతో అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ బలోపేతానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.

CEC : నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి.. ఎలక్షన్ కమిషన్ ఆదేశం

రూ.1700 కోట్లతో ఫీడర్లను ఏర్పాటు చేసి రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను ఇస్తున్నామని తెలిపారు. ఉచిత విద్యుత్‌ను స్థిరంగా ఇవ్వడానికి రూ.2.4లకే యూనిట్‌ ధరతో సెకీతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. మరో 25 సంవత్సరాలపాటు రైతులకు ఎలాంటి ఢోకా లేకుండా ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గుతుందన్నారు.

దాదాపు రూ.3099 కోట్లతో సబ్‌స్టేషన్లకోసం ఖర్చుచేస్తున్నాం, ఇప్పటికే కొన్నింటిని ప్రారంభించాం. మరికొన్నింటి పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. రూ. 3400 కోట్లతో 850 మెగావాట్ల సోలార్‌ పవర్‌కు శ్రీకారం చుడుతున్నామని వెల్లడించారు. రూ.6500 కోట్ల పెట్టుబడి పెడుతున్నామని తెలిపారు. అవేరా స్కూటర్స్‌ తయారీ సంస్థకు శ్రీకారం చుడుతున్నామని వెల్లడించారు.

Sonia Gandhi : దొరల తెలంగాణని ప్రజల తెలంగాణగా మార్చాలి.. తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ సందేశం

ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించిందని లక్ష స్కూటర్ల ఉత్పత్తి దిశగా సామర్థ్యాన్ని పెంచుకుంటుందన్నారు. 100 మందికి ఇప్పటికే ఉద్యోగాలు ఉన్నాయని, తాజా పెట్టుబడి వల్ల అదనపు ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. 28 సబ్‌ స్టేషన్లలో 200 మందికి ఉద్యోగావకాశాలు వస్తున్నాయని పేర్కొన్నారు. 850 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టు వల్ల 1700 ఉద్యోగాలు రాబోతున్నాయని వివరించారు. హెచ్‌పీసీఎల్‌తో రూ.10 వేల కోట్ల పెట్టుబడికి ఒప్పందం పెడుతున్నామని తెలిపారు.

సోలార్‌,విండ్‌, పీఎస్పీ, గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టులను వీరు పెడుతున్నారని పేర్కొన్నారు. దాదాపుగా 1500 మందికి ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కాలుష్య రహిత విద్యుత్‌ రాష్ట్రానికి మేలు చేస్తుందన్నారు. పలు విద్యుత్‌ ప్రాజెక్టులను ఈరోజు ఇక్కడి నుంచి ప్రారంభిస్తూ ఈ రంగంలో మరింత అభివృద్ధి సాధించే దిశలో అడుగులు ముందుకు వేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా, వర్చువల్‌గా పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి సీఎం జగన్ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు.