CM Jagan Bsu Yatra : విశాఖ జిల్లాలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర
ఆదివారం ఉదయం సీఎం జగన్ బస్సు యాత్రను ప్రారంభించారు. చిన్నయ్యపాలెం వద్ద నుంచి బయలుదేరి పినగాడ జంక్షన్ మీదుగా విశాఖ పట్టణం జిల్లాలోని జగన్ బస్సు యాత్ర ప్రవేశించనుంది.

CM Jagan Memantha Siddam Yatra
CM Jagan Memantha Siddam Yatra : ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 20వ రోజుకు చేరుకుంది. ఆదివారం బస్సు యాత్ర విశాఖ పట్టణంలో కొనసాగనుంది. విశాఖ జిల్లాలోని పెందుర్తి, విశాఖ పశ్చిమ, ఉత్తర, దక్షిణ, తూర్పు, భీమిలి నియోజకవర్గాల్లో బస్సు యాత్ర సాగనుంది. శనివారం బస్సు యాత్ర అనకాపల్లి జిల్లా చిన్నయపాలెం ప్రాంతంలో ముగిసింది. జగన్ అక్కడే బస చేశారు. ఇవాళ ఉదయం సీఎం జగన్ బస్సు యాత్ర చిన్నయ్యపాలెం వద్ద నుంచి బయలుదేరి పినగాడ జంక్షన్ మీదుగా విశాఖ పట్టణం జిల్లాలోకి ప్రవేశించనుంది.
Also Read : Cm Jagan : నేను బచ్చా అయితే నా చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన నిన్ను ఏమనాలి?- చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్
పినగాడి జంక్షన్, లక్ష్మీపురం మీదుగా వేపగుంట జంక్షన్ కు బస్సుయాత్ర చేరుకుంటుంది. జంక్షన్ దాటిన తరువాత భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో గోపాలపట్నం మీదుగా బస్సు యాత్ర కొనసాగనుంది. ఎన్ ఏడీ జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దిలపాలెంకు సీఎం జగన్ చేరుకుంటారు. అనంతరం వెంకోజిపాలెం, హనుమంతువాక మీదుగా ఎంవీవీ సిటీ ఎండాడ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకుంటారు. జగన్ బస్సు యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తుంది. విశాఖ జిల్లాలోనూ బస్సు యాత్రకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చేలా వైసీపీ నేతలు ఏర్పాట్లు చేశారు.
Also Read : Rajanagaram Race Gurralu : వైసీపీ వర్సెస్ జనసేన.. రాజానగరంలో హోరాహోరీ సమరం