Mekapati Goutham Reddy: అపాయింట్‌మెంట్ తీసుకున్నారు.. ఇంతలోనే! మాటల్లో చెప్పలేని బాధ అంటూ సీఎం జగన్!

ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‍రెడ్డి 49ఏళ్ల వయసులో గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతి చెందారు.

Mekapati Goutham Reddy: అపాయింట్‌మెంట్ తీసుకున్నారు.. ఇంతలోనే! మాటల్లో చెప్పలేని బాధ అంటూ సీఎం జగన్!

Mekapati Goutham Reddy Abu Dhabi

Updated On : February 21, 2022 / 11:39 AM IST

Mekapati Goutham Reddy: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‍రెడ్డి 49ఏళ్ల వయసులో గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతి చెందారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి 2014, 2019లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గౌతమ్ రెడ్డి.. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో ఇండస్ట్రీస్‌, కామర్స్‌, ఐటీ అండ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మంత్రిగా పనిచేస్తున్నారు.

నెల్లూరు రాజకీయాల్లో ముఖ్యమైన నేతగా ఉన్న గౌతమ్ రెడ్డి మరణంతో కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. దుబాయ్ పర్యటన ముగించికుని వారం రోజుల తర్వాత హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకున్న గౌతమ్.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి మంగళవారం అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు.

దుబాయ్ వివరాలను.. పెట్టుబడులకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రికి వివరించాలని అనుకున్నారు. ఈలోపే విషాదం చోటుచేసుకుంది. కాసేపట్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. అంతకుముందే గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ముఖ్యమంత్రి.. ‘తొలినాటి నుంచి సుపరిచితుడైన యువనాయకుడు గౌతమ్‌రెడ్డిని కోల్పోవడం మాటల్లో చెప్పలేనంత బాధగా ఉంది’ అని అన్నారు.