ర్యాపిడ్ టెస్ట్ కిట్ల పర్చేజ్ ఆర్డర్ లో ఏపీ పెట్టిన చిన్న షరతు… కోట్లు మిగల్చబోతోంది
దక్షిణ కొరియా నుంచి ఏపీ ప్రభుత్వం కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాజకీయ దుమారం రేగింది. ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు

దక్షిణ కొరియా నుంచి ఏపీ ప్రభుత్వం కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాజకీయ దుమారం రేగింది. ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు
దక్షిణ కొరియా నుంచి ఏపీ ప్రభుత్వం కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాజకీయ దుమారం రేగింది. ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ముఖ్యంగా వైసీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎంత కమీషన్ నొక్కారని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా ప్రశ్నించడం, దానికి విజయసాయిరెడ్డి ఘాటుగా కౌంటర్ ఇవ్వడం జరిగాయి. ఏపీలో హాట్ టాపిక్ గా మారిన ఈ వ్యవహారంపై సీఎం జగన్ స్పందించారు. ప్రభుత్వ సొమ్మును ఆదా చేసిన వైద్య ఆరోగ్యశాఖను సీఎం అభినందించారు.
‘ర్యాపిడ్ కిట్లు చాలా అవసరం..కేంద్రాన్ని అడిగితే ఇవ్వలేని పరిస్థితి. ప్రపంచంలో ఎక్కడున్నా సరే కొనుక్కోవాలని కేంద్రం చెప్పింది. ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిన కంపెనీకి వైద్య ఆరోగ్యశాఖ ఆర్డర్ ఇచ్చింది. ఏ రాష్ట్రానికైనా తక్కువకు ధరకు అమ్మితే..అదే ధరను తాము కూడా చెల్లిస్తామని ఆర్డర్‌లో స్పష్టం చేశాం. రాజీపడకుండా కిట్లను వేగంగా తెప్పించగలగడం అభినందనీయం. మేం ఆర్డర్ ఇచ్చేటప్పుడు.. ఆ కిట్లు బయట దేశంలో తయారయ్యేవి. ఇప్పుడు అదే కంపెనీ మనదేశంలో ఐసీఎంఆర్ అనుమతులు పొందింది. షరతుల కారణంగా కిట్‌రేట్ కూడా తగ్గబోతోందని’ సీఎం అన్నారు.
‘చాలా నిజాయితీగా ఆలోచన చేసి ఆర్డర్ చేశారు. మిమ్మల్ని అభినందిస్తున్నా. ఐసీఎంఆర్ రూ.795లకు కొనుగోలుకు ఆర్డర్ ఇస్తే… రూ.65ల తక్కువ రేటుకు ఏపీ ఆర్డర్ ప్లేస్ చేసింది. ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు పర్చేజ్ ఆర్డర్‌లో షరతు పెట్టాము. ఒకవేళ తక్కువ ఖర్చుకు ఏ రాష్ట్రానికైనా అమ్మితే.. ఆ రేటు ప్రకారమే చెల్లిస్తామని ఆర్డర్‌లో స్పష్టం చేశాము. ఇలాంటి ఆలోచన సాధారణంగా ఎవ్వరూ చేయరు. రాజీపడకుండా కిట్లను వేగంగా తెప్పించుకోవడంలో ఆలస్యం చేయకుండా తీసుకున్న చర్యలు ప్రశంసనీయం. ఇప్పటివరకూ 25శాతం మాత్రమే పేమెంట్ ఇచ్చారు. ఇంత ఒత్తిళ్ల మధ్య మంచి ఆలోచనతో కొనుగోలు చేశారు. అవినీతి అన్నది ఎక్కడా లేకుండా ఉండాలన్న ఆలోచనకు అనుగుణంగా మీరు పనిచేస్తున్నారు. నేను చాలా సంతోషిస్తున్నా. మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ కిట్లు బయట దేశంలో తయారయ్యాయి. ఇప్పుడు అదే కంపెనీ మన దేశంలో తయారు చేయడానికి ఐసీఎంఆర్ అనుమతులు ఇచ్చింది. దీని వల్ల కిట్ రేటు తగ్గింది. మనం పెట్టుకున్న షరతు కారణంగా రేటు కూడా తగ్గబోతుంది. దీనికి కూడా ఆ కంపెనీ అంగీకరించింది. నేను అధికారులను అభినందిస్తున్నా’ అని సీఎం జగన్ అన్నారు.
మొత్తంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఎలాంటి గోల్ మాల్ జరగలేదు అని చెప్పడమే సీఎం జగన్ ఉద్దేశంగా తెలుస్తోంది. ర్యాపిడ్ టెస్ట్ కిట్ల పర్చేజ్ ఆర్డర్ లో ఏపీ పెట్టిన చిన్న షరతు… కోట్లు మిగల్చబోతోందని పరోక్షంగా స్పష్టం చేశారు సీఎం జగన్. దీనికి విపక్షాల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.