పేదల కుటుంబాలు అప్పుల పాలయ్యే పరిస్థితి రావొద్దు : సీఎం జగన్

పేద కుటుంబాలు అప్పుల పాలు కావొద్దని, అదనంగా వాళ్ల పిల్లల చదువును ప్రోత్సహించే క్రమంలోనే వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా సాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు.

పేదల కుటుంబాలు అప్పుల పాలయ్యే పరిస్థితి రావొద్దు : సీఎం జగన్

CM Jagan

YSR Kalyanamasthu Funds Release: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వైయస్సార్ కల్యాణమస్తు, వైయస్సార్ షాదీ తోఫా ఐదో విడత నిధులను బటన్ నొక్కి లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పేద కుటుంబాలు అప్పుల పాలు కావొద్దని, అదనంగా వాళ్ల పిల్లల చదువును ప్రోత్సహించే క్రమంలోనే వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా సాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన 10,132 మంది జంటలకు, పిల్లలకు ఈ కార్యక్రమం అమలవుతుందని అన్నారు. గత ప్రభుత్వం చంద్రబాబు హయాంలో ఇది నామ్ కే వాస్తే ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు కాకుండా ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే ఒకనెల వెరిఫికేషన్ ఇచ్చి వెంటనే ఇచ్చేట్టుగా, గ్రామ సచివాలయాల్లోనే మ్యారేజీ సర్టిఫికెట్లు ఇచ్చేట్టుగా మార్పులు చేశామని జగన్ అన్నారు.

Also Read : కూటమితో ఇన్ని కష్టాలా? టీడీపీ నేతలకు తలనొప్పిగా మారిన పొత్తులు..!

ప్రతి ఒక్కరికీ ఈ పథకం అందుబాటులోకి తీసుకొస్తూ ఈ పథకాన్ని సచివాలయం దాకా తీసుకుపోయామని సీఎం జగన్ చెప్పారు. 5వ విడత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ క్వార్టర్‌కు సంబంధించినది ఇవాళ ఇస్తున్నామని, దాదాపు రూ.78 కోట్లు ఇస్తున్నామని జగన్ అన్నారు. ఇంత వరకు 56,194 జంటలకు రూ.427 కోట్లు జమ చేసినట్లు సీఎం జగన్ అన్నారు. మన కుటుంబాల భవిష్యత్ మారాలన్నా, మన తలరాతలు మారాలన్నా, మంచి ఉద్యోగాలతో మంచి జీతాలు రావాలన్నా, మంచి చదువులు మనకు చేతుల్లో ఉండాలని, అప్పుడే మన తలరాతలు మార్చే ఆస్తి మన చేతుల్లోనే ఉంటుందని జగన్ అన్నారు.

Also Read : మీసం మెలేసి.. సై అంటే సై.. జగన్, చంద్రబాబు మధ్య ఓ రేంజ్‌లో మాటల యుద్ధం

18 సంవత్సరాలు వధువుకు, 21 సంవత్సరాలు వరుడికి ఉండాలన్న నిబంధన ఈ పథకాలకు ఉందని, దీంతో గతంలోలా చిన్నవయస్సులోనే పెళ్లిళ్లు చేయడం ఆగిపోయిందని జగన్ అన్నారు. దీనికితోడు ఇంటర్ మీడియట్‌ చదివిస్తే అమ్మ ఒడి పథకం ప్రభుత్వం ఇస్తుందని, దీంతో ప్రతి సంవత్సరం తల్లికి అమ్మ ఒడి ద్వారా మంచి జరుగుతుందని, పిల్లలను ఖచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ చదివించే కార్యక్రమం అడుగులు వేస్తారని జగన్ అన్నారు. ఇంటర్ అయిపోయిన తర్వాత పూర్తి ఫీజు రీయింబర్సుమెంట్ ఇచ్చే విద్యాదీవెన ఉందని, అదేమాదిరిగా వసతి దీవెన కూడా ఉందని, ఈ రెండు స్కీములు ఎలాగూ ఉన్నాయి కాబట్టి చదువులను ప్రోత్సహిస్తూ ప్రతిఒక్కరూ గ్రాడ్యుయేట్స్ అయ్యేలా అడుగులు వేయించగలుగుతున్నామని జగన్ చెప్పారు. ఇలా, పేద కుటుంబాల్లోని పిల్లలుకూడా గ్రాడ్యుయేట్స్ దాకా చదువుకునే అవకాశం ఉంటుందని, చదువు మన చేతిలో ఉంటే మంచి ఉద్యోగాలు వస్తాయని, తద్వారా మన కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని జగన్ చెప్పారు.