CM Jagan : వైఎస్సార్ వాహనమిత్ర నిధులు విడుదల.. రూ.275.93 కోట్లు లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిన సీఎం జగన్

రైతన్నల కష్టాలు తెలిసిన ప్రభుత్వం మనదన్నారు. రైతన్న కన్నీళ్లు పెట్టకూడదని 39 వేల 85 కోట్ల రూపాయలు రైతు భరోసా ద్వారా ఖర్చు చేశామని తెలిపారు.

CM Jagan : వైఎస్సార్ వాహనమిత్ర నిధులు విడుదల.. రూ.275.93 కోట్లు లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిన సీఎం జగన్

CM Jagan YSR Vahanamitra

CM Jagan – YSR Vahanamitra : వైఎస్సార్ వాహనమిత్ర ఐదో విడత నిధులను సిఎం జగన్ విడుదల చేశారు. రాష్ట్రంలో 2,75,931 మందికి రూ.10 వేల చొప్పున రూ.275.93 కోట్లను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రతుకు బండి లాగడానికి ఇబ్బందిపడే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు జగనన్న ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అటో, ట్యాక్సీ డ్రైవర్లకు ప్రతీ ఏటా వాహనమిత్ర ద్వారా ఏడాదికి పదివేలు అందచేస్తున్నామని తెలిపారు.

శుక్రవారం సీఎం జగన్ వైఎస్సార్ వాహనమిత్ర ఐదో విడత నిధులను విజయవాడలో విడుదల చేశారు. 2,75,931 మందికి రూ.275.93 కోట్లు బటన్ నొక్కి నేరుగా వారి అకౌంట్ లలోకి వేస్తున్నామని చెప్పారు. ఒక్క పథకం ద్వారానే దాదాపు 1300 కోట్ల రూపాయలు నేరుగా అకౌంట్ లలోకి వేశామని తెలిపారు. ఆటో, ట్యాక్సీలను నడుపుతున్న కుటుంబాలకు ఈ ఆర్ధిక సాయం చేదోడు వాదోడుగా నిలుస్తుందన్నారు.

CM Jagan : రానున్న 2 నెలలు కీలకం, ప్రతి ఇంటికీ తిరగాలి, టికెట్ రాకపోతే బాధపడొద్దు- ఎమ్మెల్యేలతో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డబ్బులు ఎలా వాడతారో తాను అడగనని చెప్పారు. మీ వాహనాలకు సంబంధించి ఇన్స్యూరెన్స్, వాహనాల ఫిట్ నెస్ సర్టిఫికేట్ ఉండేలా చూసుకోవలన్నారు. మీ వాహనాల్లో ప్రయాణికులు ఉన్నారని మర్చిపోకండి అని సూచించారు. ఇది జగనన్న ప్రభుత్వం కాదు మీ అందరి ప్రభుత్వం అని అన్నారు. ఇళ్లు లేని వారికి ఇళ్ల స్ధలాలిచ్చి నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.

ఇళ్ల వద్దకే వచ్చి బర్త్, క్యాస్ట్ సర్టిఫికేట్ జల్లెడ పడుతున్నామని పేర్కొన్నారు. ఏ పేదవాడైతే తన కష్టాన్ని చెప్పుకోలేని వారు ఉంటారో వాళ్ల కోసం ఈ ప్రభుత్వం నిలబడుతున్నారు. రైతన్నల కష్టాలు తెలిసిన ప్రభుత్వం మనదన్నారు. రైతన్న కన్నీళ్లు పెట్టకూడదని 39 వేల 85 కోట్ల రూపాయలు రైతు భరోసా ద్వారా ఖర్చు చేశామని తెలిపారు.

Harsha Kumar : చంద్రబాబు అరెస్ట్ ను జగన్ వాడుకుంటున్నారు : హర్షకుమార్

వేట నిషేధం సమయంలో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న 2 లక్షల 40 వేల మంది మత్స్యకార కుటుంబాలకు 538 కోట్ల రూపాయలు అందచేశామని తెలిపారు. 82 వేల చేనేత కుటుంబాలకు ఐదేళ్ళలో 982 కోట్ల రూపాయలు అందచేశాని పేర్కొన్నారు. 15 లక్షల మందికి పైగా చిరు వ్యాపారులకు ఐదేళ్లలో రూ.2956 కోట్లు వడ్డీ లేని రుణాలు అందచేశామని తెలిపారు.

జగనన్న చేదోడు పథకం ద్వారా ఐదేళ్లలో 3 లక్షల 30 వేల మందికి రూ.927 కోట్లు అందచేశామని పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఆలోచించలేదన్నారు. మహిళా సాధికారిత కోసం ఉద్యమిస్తున్న ప్రభుత్వం మనదన్నారు. జగనన్న అమ్మఒడి ద్వారా నాలుగేళ్ళలో 44 లక్షల 44 వేల మందికి రూ.26 వేల కోట్లు అందచేశామని తెలిపారు. జగనన్న విద్యాదీవేన ద్వారా రూ.13 వేల కొట్లకు పైగా అందచేశామని చెప్పారు.

High Court : లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ ను డిస్పోజ్ చేసిన ఏపీ హైకోర్టు.. విచారణకు సహకరించాలని ఆదేశం

తల్లిదండ్రులు ఇబ్బందులు పడకుండా వసతి దీవెన ద్వారా 4 వేల 275 కోట్ల రూపాయలు అందచేశామని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు మాటలు నమ్మి పొదుపు సంఘాల మహిళలు మోసపోయారని పేర్కొన్నారు. వైఎస్ ఆసరా పధకం కింద 80 లక్షల మందికి రూ.19 వేల 178 కోట్లు సహాయం అందించామని తెలిపారు. వైఎస్ ఆర్ చేయూత ద్వారా రూ.14,127 కోట్లు అందచేశామని వెల్లడించారు.

కాపు నేస్తం ద్వారా రూ.2 వేల 220 కోట్లు అందచేశామని తెలిపారు. ఇళ్లు లేని పేదలు ఉండకూడదని 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్ధలాలు ఇచ్చామని పేర్కొన్నారు. 21 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించామని చెప్పారు. ఇవన్నీ ఎవరో అడిగితేనో ఉద్యమాలు చేస్తేనో ఇవ్వలేదని.. మీ సమస్యలు తెలుసుకున్నాను కాబట్టే అమలు చేస్తున్నానని చెప్పారు.

Byreddy Siddharth Reddy: మీరు సీఎం జగన్‌కి భయాన్ని పరిచయం చేస్తారా?: బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఎద్దేవా

రేపు కురుక్షేత్రం యుద్ధం జరగబోతుందన్నారు. నిరుపేదల కోసం నిలబడిన మన ప్రభుత్వం ఒకవైపు ఉంటే‌ నిరుపేదలను వంచించిన వారు మరొక పక్క ఉన్నారని తెలిపారు. సామాజిక అన్యాయాలు చేసే ప్రత్యర్ధులతో యుద్ధం జరగబోతుందన్నారు. మ్యానిఫెస్టోను చెత్తబుట్టలో వేసేసి అందులో పదిశాతం కూడా‌ అమలు చేయని వారితో యుద్ధం జరగబోతుందన్నారు.

ఎస్సీ కులాల్లో ఎవరైనా పుడతారా అనే అహంకారానికి బీసీల పట్ల అనుచితంగా మాట్లాడుతూ కండకావరం పదర్శించిన వారితో యుద్ధం జరగబోతుందన్నారు. సీబీఎస్ఈ, ఐబీ సిలబస్ మనం తీసుకొస్తుంటే పేదలకు ఇంగ్లిష్ మీడియం ఉండకూడదన్న పెత్తందారులతో యుద్ధం జరగబోతుందన్నారు. ఇళ్ల స్ధలాలిచ్చిన ప్రభుత్వం మనదైతే పేదలకు ఇళ్ల స్ధలాలివ్వకూడదని కోర్టులకెళ్లి కేసులేస్తున్న పెత్తందారి భావజాలం మధ్య యుద్ధం జరగబోతుందని చెప్పారు.

Mynampally Hanumanth Rao : ప్రజలు నాతోనే ఉన్నారు, తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే- మైనంపల్లి హనుమంతరావు

మ్యానిఫెస్టోలో ఉన్న అన్ని హామీలను అమలు చేశామని తెలిపారు. మ్యానిఫెస్టో లో 99 శాతం అమలు చేశామని పేర్కొన్నారు. 2 లక్షల 35 వేల కోట్ల రూపాయల లంచాలకు అవకాశం లేకుండా లబ్ధిదారులకు అందచేశామని చెప్పారు. ఫైబర్ స్కాం, స్కిల్ డవలప్ మెంట్ స్కాం, ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం, అమరావతి స్కాం, నీరు చెట్టు దోపిడీ అక్క చెల్లెమ్మలకు చేసిన మోసాలకు పాల్పడ్డ వారితో యుద్ధం జరుగుతుందని చెప్పారు.

లక్షల కోట్లు పేదలకు ఇస్తున్నామని మన ప్రభుత్వం చేసిన అప్పులు తక్కువేనని తెలిపారు. గతంలో ఎందుకు ఇలా చేయలేకపోయారని ప్రశ్నించారు. డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని నిలదీశారు. వాళ్లకు అధికారం కావాల్సింది దోచుకోవడానికి, దాచుకుంది పంచుకోవడానికి అంతేకాని పేదల గుండెల్లో చిరస్ధాయిగా నిలిచిపోదామని లేదని విమర్శించారు. వారి మాదిరిగా తనకు పేపర్లతో పాటు దత్తపుత్రుడు సపోర్ట్ లేదని పేర్కొన్నారు.

KTR : రైతుబంధు రూపంలో రైతులకు రూ.73 వేల కోట్లు అందించాం : మంత్రి కేటీఆర్

వాళ్లు చెబుతున్న మోసపు మాటలను నమ్మకండి అని పిలుపునిచ్చారు. ఇంటికొచ్చి కేజి బంగారం, బెంజి కారు ఇస్తామని చెబుతారు నమ్మకండి అని అన్నారు. ‘మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా ‌లేదా కొలమానం తీసుకోండి, మీ ఇంట్లో మంచి జరిగితే నాకు సపోర్ట్ గా నిలవండి’ అని కోరారు. పేదలకు, పెత్తందారుల మధ్య యుద్ధం జరుగుతుందన్నారు. పేదవాడి ప్రభుత్వాన్ని నిలబెట్డుకునేందుకు, పెత్తందారులు రాకూడదని అడుగులు వేస్తున్నామని తెలిపారు.