CM Jagan : ఏపీలో భారీ టూరిజం ప్రాజెక్ట్.. 48వేల మందికి ఉద్యోగాలు
పర్యాటక రంగానికి ఏపీ చిరునామాగా మారాలని.. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రాజెక్టులు ఉండాలని సీఎం జగన్ అన్నారు. అత్యాధునిక వసతులు అందుబాటులోకి రావాలని.. నిర్దేశిత సమయంలోగా..

Cm Jagan
CM Jagan : పర్యాటక రంగానికి ఏపీ చిరునామాగా మారాలని.. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రాజెక్టులు ఉండాలని సీఎం జగన్ అన్నారు. అత్యాధునిక వసతులు అందుబాటులోకి రావాలని.. నిర్దేశిత సమయంలోగా ప్రాజెక్టులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆధునిక వసతులు అందుబాటులోకి రావడంతో టూరిజం పరంగా రాష్ట్ర స్ధాయి పెరుగుతుందన్నారు. పెద్ద సంఖ్యలో దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తారని చెప్పారు.
Pan Number : పాన్ నెంబర్ ఇతరుల చేతుల్లోకి వెళ్లిందా…అయితే జాగ్రత్త..
స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న భారీ టూరిజం ప్రాజెక్టులపై చర్చించారు. దీని ద్వారా ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనున్నారు. ఒక్కో ప్రాజెక్టుపై కనీసం రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. వివిధ ప్రాజెక్టులపై మొత్తంగా రూ.2868.6 కోట్లు వెచ్చించనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 48వేల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. దాదాపు 1,564 గదులు కొత్తగా అందుబాటులోకి వస్తాయి. వీటిని కంపెనీలు ఐదేళ్ల కాలంలో పూర్తి చేయనున్నాయి.
Sitting : ఎక్కువసేపు కూర్చునే ఉంటున్నారా..! గుండెజబ్బులు వచ్చే ఛాన్స్ అధికమే?
విశాఖపట్నం, తిరుపతి, గండికోట, హార్సిలీ హిల్స్, పిచ్చుకలంకలో ప్రఖ్యాత కంపెనీ ఓబెరాయ్ ఆధ్వర్యంలో రిసార్టులు రానున్నాయి. ఓబెరాయ్ విలాస్ బ్రాండ్‌తో రిసార్టులు రానున్నాయి. విశాఖపట్నం శిల్పారామంలో హయత్ ఆధ్వర్యంలో స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. తాజ్ వరుణ్ బీచ్ పేరుతో విశాఖలో మరో హోటల్, సర్వీస్ అపార్ట్‌మెంట్.. టన్నెల్ ఆక్వేరియం, స్కైటవర్ నిర్మాణం చేపట్టనున్నారు. విజయవాడలో హయత్ ప్యాలెస్ హోటల్, అనంతపురం జిల్లా పెనుగొండలో జ్ఞానగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం దగ్గర ఇస్కాన్ ఛారిటీస్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రం ఏర్పాటును ప్రభుత్వం ప్రతిపాదించగా ఎస్‌ఐపీబీ వీటికి ఆమోదం తెలిపింది.