CM Jagan : ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న సీఎం జగన్.. రూ. 216 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

CM Jagan : ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న సీఎం జగన్.. రూ. 216 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు

CM Jagan

YS Jagan mohan Reddy : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానంతరం సీఎం జగన్ కు వేద పండితులు ఆశీర్వచనంతో పాటు అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను వైదిక కమిటీ సభ్యులు, దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో రామారావులు అందజేశారు. అంతకుముందు సీఎం జగన్మోహన్ రెడ్డి రూ. 216 కోట్లతో దుర్గగుడి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.

Also Read : Chandrababu : తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన.. ఎప్పటినుంచి అంటే..

జగన్ శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులు ఇవే.. 

– రూ. 5.60 కోట్లతో శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయ పున: నిర్మాణానికి శంకుస్థాపన
– రూ. 4.25 కోట్లతో ఇంద్రకీలాద్రి పై కొండ రక్షణ చర్యపనులు
– రూ. 3.25 కోట్లతో ఎల్టీ ప్యానల్ బోర్డులు, ఎనర్జీ వాటర్ మేనేజ్ మెంట్ మరియు స్కాడా ఏర్పాటు
– రూ. 3.87 కోట్లతో 2016 పుష్కరాల సమయంలో కూల్చివేసిన ఆలయాల పునర్నిర్మాణం.
– రూ. 5.66 కోట్లతో మెగా సోలార్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు
– రూ. 0.23 కోట్లతో కొండ దిగువున బొడ్డు రాయి నిర్మాణం.
– రూ. 0.265 కోట్లుతో కొండ దిగువున తొలిమెట్టు వద్ద ఆంజనేయ స్వామి, వినాయక స్వామి వార్ల ఆలయ నిర్మాణం.
– రూ.30కోట్లతో అమ్మవారి అన్నప్రసాద భవన నిర్మాణ.
– రూ.27కోట్లతో అమ్మవారి ప్రసాదం పోటు భవన నిర్మాణం.
– రూ. 13 కోట్లతో కనకదుర్గ నగర్ నుండి మహామండపం వరకు ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ నిర్మాణం.
– రూ.15కోట్లతో రాజగోపురం ముందు భాగాన మెట్ల నిర్మాణం.
– రూ.23.50 కోట్లతో మహామండపం వద్ద అదనపు క్యూలైన్ల ఏర్పాటు.
– రూ.7.75 కోట్లతో కనక దుర్గ నగర్ వద్ద మహారాజద్వారం నిర్మాణం.
– రూ.7.50 కోట్లతో కనకదుర్గ నగర్ నుండి మహామండపం వరకు రాజమార్గం అభివృద్ధి పనులు.
– రూ. 7 కోట్లతో కొండపైన పూజా మండపాల నిర్మాణం.
– రూ. 18.30 కోట్లతో మల్లికార్జున మహామండపం క్యూ కాంప్లెక్స్ మార్పు పనులు.
– రూ. 19కోట్లతో నూతన కేశఖండన శాల నిర్మాణం పనులు.
– రూ. 10కోట్లతో గోశాల అభివృద్ధి పనులు.
– రూ. 5కోట్లతో కొండపన యాగశాల నిర్మాణం.
– రూ. 33కోట్లతో కనకదుర్గనగర్ లో మల్టీ లెవల్ కార్ పార్కింగ్

మొత్తం రూ. 216 కోట్లతో దుర్గగుడి అభివృద్ధి పనులకు సీఎం జగన్ గురువారం శంకుస్థాపనలు చేశారు.