CM Jagan : ప్రికాషన్ డోస్ వ్యవధి తగ్గించండి.. కేంద్రానికి సీఎం జగన్ విజ్ఞప్తి

కోవిడ్ నియంత్రణలో భాగంగా ప్రికాషన్ డోసు వేసేందుకు నిర్దేశించిన వ్యవధిని తగ్గించాలంటూ కేంద్రానికి సీఎం జగన్ లేఖ రాయనున్నారు. ప్రికాషన్ డోస్ వ్యవధిని 9 నెలల నుంచి 6 నెలలకు..

CM Jagan : ప్రికాషన్ డోస్ వ్యవధి తగ్గించండి.. కేంద్రానికి సీఎం జగన్ విజ్ఞప్తి

Cm Jagan

Updated On : January 17, 2022 / 5:31 PM IST

CM Jagan : సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా ప్రికాషన్ డోసు వేసేందుకు నిర్దేశించిన వ్యవధిని తగ్గించాలంటూ కేంద్రానికి సీఎం జగన్ లేఖ రాయనున్నారు. కోవిడ్ కట్టడి, వ్యాక్సినేషన్ పై సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు.

ప్రికాషన్ డోస్ వ్యవధిని 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించాలని కేంద్రానికి రాసే లేఖలో విజ్ఞప్తి చేయనున్నారు సీఎం జగన్. ఇది ఫ్రంట్ లైన్ వర్కర్లు, అత్యవసర సర్వీసుల సిబ్బందికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్న వేళ అసవరమైన ఆక్సిజన్, ఇతర మందులు సిద్ధం చేయాలని సీఎం సూచించారు.

Feet Swelling : పాదాల్లో వాపులా!…సమస్యేంటో తెలుసుకోవాల్సిందే?

ప్రతి నియోజకవర్గానికి ఒక కోవిడ్ కేర్ సెంటర్ గుర్తించామని, 28వేల బెడ్లు సిద్ధం చేశామని అధికారులు సీఎంకి వివరించారు. సమన్వయం కోసం సాంకేతిక పరిజ్ఞానంతో యాప్ ఉండాలని, టెలీ మెడిసిన్ ద్వారా వైద్యం అందేలా చూడాలని సీఎం జగన్ అధికారులతో చెప్పారు. 104 కాల్ సెంటర్ పైనా సీఎం జగన్ సమీక్షించారు. కాల్ సెంటర్ పటిష్టంగా పని చేయాలని ఆదేశించారు.

Indian Army: ఇండియన్ ఆర్మీ “యూనిఫామ్” గురించి 5 ఆసక్తికర అంశాలు

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతూ కలరపెడుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందు జాగ్రత్త (ప్రికాషన్‌ లేదా మూడో డోసు) డోసును పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతానికి ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 60 ఏళ్లుపైబడి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రమే ఈ డోసుకి అర్హులు. గతంలో రెండు డోసులు ఏ కంపెనీ టీకా తీసుకున్నారో ‘బూస్టర్‌ డోస్‌’గా అదే టీకా ఇస్తున్నారు.