CM Jagan Tour : ఢిల్లీకి సీఎం జగన్.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రధానితో భేటీ..!
ఏపీ సీఎం జగన్ సోమవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆయన భేటీ కానున్నారు. దాదాపు 14 నెలల తరువాత మోడీని సీఎం జగన్ కలవనున్నారు.

Cm Jagan Tour To Delhi Today, Cm To Be Meet Pm Modi
CM Jagan Tour : ఏపీ సీఎం జగన్ సోమవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆయన భేటీ కానున్నారు. దాదాపు 14 నెలల తరువాత మోడీని సీఎం జగన్ కలవనున్నారు. లాస్ట్ టైం.. 2020 అక్టోబర్‌లో మోడీని జగన్ కలిశారు. ఏపీలో పరిస్థితులు, రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన ఆర్ధిక సహకారం, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కొనసాగింపు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరణ, రాష్ట్ర వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకంతో PM-కిసాన్ పథకం కొనసాగింపు అనుమతులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, కేంద్రం నుంచి పెండింగ్‌లో ఉన్న గ్రాంట్‌ల విడుదల, వరద సహాయం నిధులు,రాష్ట్రానికి ప్రత్యేక హోదా సహా ఇతర అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు సీఎం జగన్. విభజన సమస్యలు పరిష్కారం, విభజన చట్టంలో పొందుపరచిన పలు హామీల అమలును సత్వరమే నెరవేర్చాలని మోదీని జగన్ కోరనున్నారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలను ఆమోదించాలని జగన్ విజ్ఞప్తి చేయనున్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రధానంగా మూడు రాజధానుల అంశంతో పాటు అమరావతి అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలపైనా జగన్ ప్రధానితో చర్చించే అవకాశం కనిపిస్తోంది. విభజన నేపథ్యంలో ఇచ్చిన అన్ని హామీలను సత్వరమే నెరవేర్చాలని ప్రధానికి సీఎం జగన్ వినతి పత్రాన్ని సమర్పించనున్నారు. విభజన చట్టం ప్రకారం.. తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలను ఇప్పించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని ప్రధానిని కోరనున్నారు.
విభజన చట్టం 9,10 షెడ్యూల్‌లోని అంశాలతో పాటు ఇంకా పరిష్కారం కాని ఎన్నో అంశాలను సత్వరమే పరిష్కరించాలని జగన్ కోరనున్నారు. తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న జల వివాదాలు, బోర్డుల పరిధి అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ప్రధానితో భేటీ అనంతరం.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను సీఎం జగన్ కలిసే అవకాశం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరణ అంశంపై 2021 మార్చిలో ప్రధాని అపాయింట్మెంట్ కోసం సీఎం జగన్ ప్రయత్నించారు. ఆ తర్వాత 9 నెలల తరువాత జగన్ మోడీని కలవనున్నారు. ఏపీలో బీజేపీ జనాగ్రహ సభ తరువాత ప్రధాని మోదీతో సీఎం జగన్ మోడీ భేటీ కానునడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : Maoists warn of sand mafia: ఇసుక మాఫియాకు మావోయిస్టులు లేఖ..కాంట్రాక్టర్లకు శిక్ష తప్పదంటూ హెచ్చరిక