YSR EBC Nestam : నేడు వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకం ప్రారంభం.. అగ్రవర్ణ పేద మహిళలకు ఆర్థిక సాయం

సీఎం జగన్ ఈ స్కీమ్‌ను తాడేపల్లి క్యాంపు కార్యాయలం నుంచి ప్రారంభిస్తారు. ఈ పథకం ద్వారా ఒక్కో మహిళకు ఏటా 15 వేలు చొప్పున మూడేళ్లలో 45 వేలు ఆర్థికసాయం అందించనున్నారు.

YSR EBC Nestam : నేడు వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకం ప్రారంభం.. అగ్రవర్ణ పేద మహిళలకు ఆర్థిక సాయం

Jagan

Updated On : January 25, 2022 / 9:14 AM IST

YSR EBC Nestam scheme : ఏపీ ప్రభుత్వం ఇవాళ వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకం ప్రారంభిస్తోంది. అగ్రవర్ణాల్లోని పేద మహిళలకూ వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పేరుతో ఆర్థిక సాయం అందించనుంది. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. మొత్తం 3 లక్షల 92 వేల 674 మంది పేద మహిళలకు 5 వదల 89 కోట్లను అందజేయనున్నారు.

సీఎం జగన్ ఈ స్కీమ్‌ను తాడేపల్లి క్యాంపు కార్యాయలం నుంచి ప్రారంభిస్తారు. ఈ పథకం ద్వారా ఒక్కో మహిళకు ఏటా 15 వేలు చొప్పున మూడేళ్లలో 45 వేలు ఆర్థికసాయం అందించనున్నారు. ఇప్పటికే మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ.. అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా కొత్తగా ఈబీసీ నేస్తం అమలు చేస్తున్నారు.

Telangana : ఫిబ్రవరి 5 నుంచి స్కూళ్లకు, కాలేజీలకు అనుమతి

రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన పేద మహిళలకు ఈ పథకం కింద డబ్బులు అందజేయనున్నారు. మేనిఫెస్టోలో ప్రకటించకపోయినప్పటికీ ఈబీసీలోని పేదల మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ఈ పథకం అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. మహిళలకు అన్ని దశల్లోనూ ప్రభుత్వం అండగా ఉంటుందని వివరించింది.