CM Jagan : నేటి నుంచి సీఎం జగన్‌ కడప జిల్లా పర్యటన

మధ్యాహ్నం కొప్పర్తిలోని వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ ఆర్చిని ప్రారంభిస్తారు. సాయంత్రం 5.25 గంటలకు ఇడుపులపాయలోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రి అక్కడే జగన్ బస చేస్తారు.

CM Jagan : నేటి నుంచి సీఎం జగన్‌ కడప జిల్లా పర్యటన

Jagan (5)

Updated On : December 23, 2021 / 6:47 AM IST

CM Jagan Kadapa tour : ఏపీ సీఎం జగన్ తన సొంత జిల్లా కడపలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇవాళ ఉదయం 9.45 గంటలకు జగన్‌.. గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 10.30 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రొద్దుటూరు చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి.. బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం బద్వేలు నియోజకవర్గంలోని గోపవరం ప్రాజెక్టు కాలనీ-1కు చేరుకుంటారు.

అక్కడ స్థానిక నాయకులతో సీఎం కాసేపు ముచ్చటిస్తారు. ఆ తర్వాత బద్వేలు రెవెన్యూ డివిజన్‌ కొత్త కార్యాలయానికి, మెజర్స్‌ సెంచురీ ఫ్లై పరిశ్రమకు జ‌గ‌న్ శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం కొప్పర్తిలోని వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ ఆర్చిని ప్రారంభిస్తారు. సాయంత్రం 5.25 గంటలకు ఇడుపులపాయలోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రి అక్కడే ముఖ్యమంత్రి జగన్ బస చేస్తారు.

Indian Citizenship : భారత పౌరసత్వం కోసం పాక్ నుంచి భారీగా దరఖాస్తులు!

రేపు ఉదయం 9 గంటలకు ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్‌కు జగన్ చేరుకుంటారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి ప్రార్థనలలో పాల్గొంటారు. అనంతరం ఆదిత్య బిర్లా యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు. రేపు మధ్యాహ్నం వైఎస్సార్‌ జగనన్న హౌసింగ్‌ కాలనీలో ఇళ్ల పట్టాల పంపిణీ, బహిరంగసభలో లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఎల్లుండి క్రిస్మస్ సందర్భంగా పులివెందుల ఈఎస్ఐ చర్చిలో నిర్వహించే వేడుకల్లో సీఎం జగన్ పాల్గొంటారు.