ఇసుక కొరత అనే మాట వినిపించకూడదు, వారం రోజుల్లో స్టాక్ చేయాలి, సీఎం జగన్ ఆదేశం

ఏపీలో ఇప్పటికే వర్షాలు బాగా మొదలయ్యాయని, ఇసుక రీచుల్లోకి నీరు చేరుతోందని సీఎం జగన్ అన్నారు. దీంతో వారం రోజుల్లోగా స్టాక్ యార్డుల్లో కావాల్సిన ఇసుకను పెద్ద ఎత్తున నిల్వ చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఇసుక కొరత ఉందనే మాట నాకు వినిపించకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. అలాగే నాణ్యమైన ఇసుకను కూడా సరఫరా చేయాలన్నారు. ఇసుకకు సంబంధించి బాధ్యతలు తీసుకుంటున్న జాయింట్ కలెక్టర్లు ప్రభుత్వ కార్యక్రమాల మీద దృష్టి పెట్టాలన్నారు సీఎం జగన్. ఉభయ గోదావరి, గుంటూరు జిల్లా కలెక్టర్లు ఇసుక డిమాండ్ బ్యాక్ లాగ్‌ను వెంటనే క్లియర్ చేయాలని సీఎం చెప్పారు.
* ఇప్పటికే వర్షాలు బాగా మొదలయ్యాయి
* రీచ్‌ల్లోకి నీరు చేరుతోంది
* వచ్చే వారం పది రోజుల్లోగా కావాల్సిన ఇసుకను స్టాక్ చేయాలి
* ఇసుకకు సంబంధించి బాధ్యతలు తీసుకుంటున్న జాయింట్ కలెక్టర్లు ప్రభుత్వ కార్యక్రమాల మీద దృష్టి పెట్టాలి
* మనకు పనులు చేసుకునే సమయం చాలా స్వల్పంగా ఉంది
* హౌసింగ్ గాని, ఆర్బీకేలు కాని, స్కూలు భవనాలకు సంబంధించి నాడు-నేడు పనులు కాని.. వీటన్నింటిపైనా జాయింట్ కలెక్టర్లు ధ్యాస పెట్టాలి
* ఉభయ గోదావరి, గుంటూరు జిల్లా కలెక్టర్లు ఇసుక డిమాండ్ బ్యాక్ లాగ్‌ను వెంటనే క్లియర్ చేయాలి
* వచ్చే 10 రోజుల్లోగా స్టాక్ యార్డుల్లో పెద్ద ఎత్తున నిల్వ చేయాలి
* నాణ్యమైన ఇసుకను కూడా సరఫరా చేయాలి
* నాణ్యమైన ఇసుకను పంపిణీ చేయలేకపోతే కలెక్టర్లు, జేసీలకు చెడ్డ పేరు వస్తుంది
* ప్రభుత్వం దగ్గరా మీకు చెడ్డపేరు వస్తుంది
* కలెక్టర్లు చర్యలు తీసుకుని బ్యాక్‌లాగ్ తీర్చడంతోపాటు, స్టాక్ యార్డుల్లో పూర్తిగా నిల్వ చేయాలి
* ఇసుక కొరత ఉందనే మాట నాకు వినిపించకూడదు
Read Here>>ఏపీ మంత్రి బాలినేని ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం