CM Jagan : రానున్న 2 నెలలు కీలకం, ప్రతి ఇంటికీ తిరగాలి, టికెట్ రాకపోతే బాధపడొద్దు- ఎమ్మెల్యేలతో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

టికెట్ రాకపోతే మీరు నా మనుషులు కాకుండా పోరు. పార్టీ మీద నమ్మకం ఉంచాలి, లీడర్ మీద నమ్మకం ఉంచాలి. CM Jagan

CM Jagan : రానున్న 2 నెలలు కీలకం, ప్రతి ఇంటికీ తిరగాలి, టికెట్ రాకపోతే బాధపడొద్దు- ఎమ్మెల్యేలతో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

CM Jagan Key Directions

CM Jagan Key Instructions : ఏపీలో రానున్న రోజుల్లో గేరు మార్చాలని వైసీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు సీఎం జగన్. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో జగన్ సమావేశం అయ్యారు. ఏపీలో రానున్న రోజుల్లో రెండు కార్యక్రమాలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ఒక్కో కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు.

ఈ నెల 29న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. 30వ తేదీ నుంచి నేతలంతా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. మరోవైపు ఎందుకు ఆంధ్రాకు జగనే కావాలి పేరిట మరో కార్యక్రమాన్ని పార్టీ పరంగా చేపట్టాలన్నారు. ప్రతీ గ్రామంలో వాలంటీర్లు, పార్టీ నేతలు ఇంటింటికి తిరిగి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పారు జగన్.

రానున్న రెండు నెలల్లో ఈ రెండు కార్యక్రమాలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రజల్లోకి వెళ్లి సంక్షేమ పథకాలు వివరించాలన్నారు జగన్. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తూనే అదనంగా రెండు కార్యక్రమాలు చేపట్టాలని జగన్ ఆదేశించారు.

Also Read..TDP: తెలుగుదేశానికి జీవన్మరణ సమస్య.. క్లిష్ట పరిస్థితులను టీడీపీ ఎలా ఎదుర్కొబోతోంది.. బాలకృష్ణ వల్ల అవుతుందా?

పనితీరు, సర్వేల ఆధారంగానే టికెట్లు..
పార్టీ నేతలతో సమావేశంలో జగన్ హాట్ కామెంట్స్ చేశారు. ” రానున్న 6 నెలల్లో ఏం చేస్తారనేది ముఖ్యం. నేతల మధ్య విబేధాలు పరిష్కరించుకోవాలి. బహుశా అందరికీ టికెట్లు రావచ్చు. కొంతమందికి నేను టికెట్లు ఇవ్వలేకపోవచ్చు. ప్రజల్లో మీరున్న పరిస్థితులను బట్టి కొన్ని కొన్ని నిర్ణయాలు ఉంటాయి. కానీ అందరికీ చెప్పేది ఒక్కటే.

టికెట్ రాకపోతే ఎవరూ బాధపడొద్దు. టికెట్ ఇవ్వకపోతే ఆ మనిషి నా మనిషి కాకుండా పోతాడు అని దయచేసి అనుకోవద్దు. టికెట్ రాని వాళ్లకు మరో విధంగా అవకాశం ఇస్తాం. టికెట్ ఇస్తే అదొక ప్రత్యేక బాధ్యత. టికెట్ వచ్చినా రాకపోయినా మీరు ఎప్పుడూ నా వాళ్లే. అది కచ్చితంగా గుర్తు పెట్టుకోండి. జట్టు ఉంటే ముడి వేసుకోవచ్చు. గుర్తు పెట్టుకోండి. టికెట్లు ఇచ్చే విషయంలో ప్రతి ఒక్కరు నా నిర్ణయాలకు పెద్ద మనసుతో సహకరించాలి. టికెట్ అనేది పూర్తిగా పనితీరు, సర్వేల ప్రాతిపతికన కేటాయిస్తాం. వైసీపీ గెలుస్తుందనే మిగతా పార్టీలు కలిసి వస్తున్నాయి. రానున్న 2 నెలలు ప్రజల్లో ఉండాలి” అని నేతలకు సూచించారు జగన్.

ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఈ 6 నెలలు మరో ఎత్తు-సీఎం జగన్
”రేపటితో అసెంబ్లీ సమావేశాలు అయిపోయాక మనం కూడా గేర్ మార్చాల్సిన సమయం కూడా వచ్చింది. ఇన్ని రోజులు మనం చేసిన క్యాంపైన్ కానీ, గడపగడప కానీ మన ప్రయాణం కానీ ఇవన్నీ ఒక ఎత్తు. అసెంబ్లీ కార్యక్రమాలు అయిపోయాక మనం చేసే కార్యక్రమాలు కానీ, ఎన్నికలకు మనం సన్నద్ధం అవుతున్న తీరు కానీ ఇవన్నీ ఇంకో ఎత్తు. ఇన్ని రోజులు మనం బాగా చేశాం కదా ఇక ఈ 6 నెలలు సరిగ్గా చేయకపోయినా పర్లేదు అని అనుకునే పరిస్థితి కాదు.

ఇన్ని రోజులు మీరు బాగా చేసినా ఈ 6 నెలలు మీరు ఏం చేయబోతున్నారు అనేది రాబోయే ఎన్నికల్లో చాలా ముఖ్యమైన ఫ్యాక్టర్ అవుతుంది. దీన్ని మనసులో పెట్టుకుని ప్రతీ అడుగు పడాలి. ఇంతకుముందు నేను చెప్పాను. 175కి 175 వైనాట్ అని. ఇట్స్ పాజిబుల్. ఇంతకుముందు నేను చెప్పాను. మళ్లీ ఇప్పుడు చెబుతున్నా. ఇటీజ్ పాజిబుల్. మనకు పాజిటివ్ సిగ్నల్స్ ఇంత బాగా ఉన్నాయి కాబట్టే.. మిగిలిన వాళ్లు, ప్రతిపక్షాలు, మనకు వ్యతిరేకులు ఒంటరిగా రావడానికి భయపడి పొత్తులు వెతుక్కునే కార్యక్రమం చేసుకుంటున్నారు.

Also Read..Nara Lokesh : రాష్ట్రపతిని కలిసిన నారా లోకేశ్.. చంద్రబాబు అరెస్ట్‌పై ఫిర్యాదు.. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్..

గ్రాస్ రూట్ లో మనం చాలా స్ట్రాంగ్ ఉన్నాము. ప్రతి ఇంటికి మీరు వెళ్లినప్పుడు వారితో మాట్లాడినప్పుడు వాళ్లలో వచ్చిన రెస్పాన్స్ మీరు చూశారు. ఇదే ఆత్మ విశ్వాసంతో, ఇదే ధైర్యంతో, ఇదే ముందు చూపుతో అడుగులు వేయించాయి. ఇప్పటివరకు ఒక ఎత్తు. ఈ 6 నెలల్లో మనం చేయబోయేది రెండో ఎత్తు. ప్రజలతో మమేకం కావడం ఒక ఎత్తు అయితే.. ఆర్గనైజేషన్, ప్లానింగ్, వ్యూహం ఇవన్నీ కూడా రెండో ఎత్తు” అని సీఎం జగన్ అన్నారు.