డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలంటూ అమిత్ షా, చిరంజీవి చేసిన ట్వీట్ వైరల్

చంద్రబాబు కేబినెట్ లో ఎవరికి ఏ శాఖ అన్నది అధికారికంగా ప్రకటించలేదు. కానీ, పవన్ కల్యాణ్ ను డిప్యూటీ సీఎం అని అమిత్ షా సంబోంధించడం హాట్ టాపిక్ గా మారింది.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలంటూ అమిత్ షా, చిరంజీవి చేసిన ట్వీట్ వైరల్

Deputy Cm Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం చంద్రబాబుకి కంగ్రాట్స్ చెప్పారు. ఈ సందర్భంగా అమిత్ షా.. ఎక్స్ లో పెట్టిన పోస్టు వైరల్ గా మారింది.

ఇవాళ చంద్రబాబు సీఎంగా, జనసేనాని పవన్ కల్యాణ్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇంకా ఎవరికీ శాఖలు కేటాయించలేదు. అయినప్పటికీ.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు అంటూ హోంమంత్రి అమిత్ షా చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. పవన్ కల్యాణ్ ను డిప్యూటీ సీఎంగా అమిత్ షా పేర్కొనడం ఇంట్రస్టింగ్ గా మారింది.

”ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు నేడు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారందరికీ నా అభినందనలు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని నేను విశ్వసిస్తున్నాను” అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు అమిత్ షా.

అటు మెగాస్టార్ చిరంజీవి సైతం ఇదే విధంగా ఎక్స్ లో ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ ను డిప్యూటీ సీఎంగా చిరంజీవి పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు అని ఆయన పోస్టు పెట్టడం ఆసక్తికరంగా మారింది. అటు అమిత్ షా, ఇటు చిరంజీవి.. పవన్ కల్యాణ్ ను ఉప ముఖ్యమంత్రిగా పేర్కొనడం రాజకీయవర్గాల్లో ఇంట్రస్టింగ్ టాపిక్ అయ్యింది.

”ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగో సారి ప్రమాణస్వీకారం చేసిన నారా చంద్రబాబునాయుడు గారికి, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, మిగతా మంత్రి వర్గానికి హార్దిక శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశం పాటుపడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.. ఆశిస్తున్నాను..” అని ట్వీట్ చేశారు చిరంజీవి.

చంద్రబాబు కేబినెట్ లో ఎవరికి ఏ శాఖ అన్నది అధికారికంగా ప్రకటించలేదు. కానీ, పవన్ కల్యాణ్ ను డిప్యూటీ సీఎం అని అమిత్ షా, చిరంజీవిలు సంబోంధించడం హాట్ టాపిక్ అయ్యింది. పవన్ కల్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి దక్కడం ఖాయం అనేందుకు ఇదే నిదర్శనం అంటున్నారు జనసైనికులు, పవన్ కల్యాణ్ అభిమానులు. డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది.