KCR-Jagan : జగన్, కేసీఆర్‌లపై కాంగ్రెస్ నేత తులసి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ లపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్, కేసీఆర్‌లు క్యారెక్టర్ లేని వ్యక్తులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Congress leader Tulsi Reddy's harsh comments on Jagan and KCR
Tulasi Reddy’s harsh comments on Jagan and KCR : తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ లపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్, కేసీఆర్‌లు క్యారెక్టర్ లేని వ్యక్తులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు తులసిరెడ్డి. మాట ఇచ్చితప్పటం..అవసరానికి తగినట్లుగా మారిపోయి పబ్బం గడుపుకోవటం ఇద్దరికి అలవాటు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. పరిస్థితులను అవకాశాలుగా మార్చుకుని వారి అవసరాలు తీర్చుకునేవారు అంటూ వ్యాఖ్యానించారు. ఇటువంటి మనుషులను ప్రజలు నమ్మకూడదని ఇప్పటికైనా అటువంటివారికి బుద్ధి చెప్పాలని సూచించారు. సీఎం కేసీఆర్ తన స్వార్థం కోసమే భారత్ రాష్ట్ర సమితి (BRS) ను పెట్టారని విమర్శించారు. కేసీఆర్ కు. జగన్ కు పదవులు..ఆస్థులు, అధికారులు తప్ప ప్రజల క్షేమం గురించి ఏమాత్రం ఆలోచించరు అంటూ విమర్శించారు. తమ స్వార్థం కోసం తప్ప ఓటు వేసిన ప్రజల గురించి పట్టించుకోని వ్యక్తులకు ప్రజలు బుద్ధి చెప్పాలని సూచించారు.
జాతీయ పార్టీ పెట్టిన కేసీఆర్ ఏపీలో సభ పెడితే ప్రజలు తరిమికొట్టాలని తులసిరెడ్డి పిలుపునిచ్చారు. గతంలో కేసీఆర్ ఆంధ్రను..నాయకులను అత్యంత దారుణమైన పదజాలంతో దూషించారని అటువంటి కేసీఆర్ కు జగన్ వత్తాలసు పలుకుతుంటారని ఇద్దరు తోడు దొంగలు అంటూ విమర్శించారు. రాయలసీమ బిర్యానిని పేడ బిర్యాని అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా తులసిరెడ్డి గుర్తు చేశారు. అటువంటి కేసీఆర్ ఏపీలో పోటీ చేస్తారట..అటువంటి కేసీఆర్ ను ఆంధ్రా ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు కొడుకు కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ యత్నాలు చేస్తున్నారని అందుకే బీఆర్ఎస్ అంటున్నారని అన్నారు తులసిరెడ్డి.