TualsiReddy: రాష్ట్రానికి బీజేపీ శని గ్రహణం అయితే వైసీపీ, జనసేనలు రాహు కేతువులు: తులసిరెడ్డి
దేశంలో అన్ని ఉత్పత్తులపై రేట్లు పెంచిన బీజేపీ ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై మోపుతుందని తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tualsi
TualsiReddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ శని గ్రహణం అయితే వైసీపీ, జనసేనలు రాహు కేతువుల్లా తయారయ్యాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్. తులసిరెడ్డి అన్నారు. గురువారం ఆయన కడప జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రతిపక్ష పార్టీలపై ఘాటు విమర్శలు చేశారు. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో మద్యపానం నిషేదిస్తామంటూ ఎన్నికల హామీ ఇచ్చారని.. అయితే ఇప్పుడు సొంత బ్రాండ్ లతోనే మద్యంపైనే అత్యధిక సంపాదన రాబడుతున్నారని తులసిరెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మద్యపాన నిషేధం హామీని అమలు చేస్తారా లేక మాట తప్పిన వారిలా మిగిలిపోతారా అంటూ తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కల్తీ సారా లేదంటూనే.. కోట్ల లీటర్ల సారా ధ్వంసం చేశామని అసెంబ్లీ సాక్షిగా లెక్కలు చెప్పడం చూస్తుంటే..ప్రభుత్వం ఎంతటి అబద్దాలు చెబుతోందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు.
Also read:Punjab : మోదీతో పంజాబ్ సీఎం భేటీ
ఇక రాష్ట్రానికి బీజేపీ శని గ్రహణం అయితే వైసీపీ, జనసేనలు రాహు కేతువులుగా మారారని తులసిరెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ రాయలసీమకు ద్రోహం చేసిందని..ప్రత్యేక ప్యాకేజి అంటూ ఏపీకి అన్యాయం చేసిన బీజేపీ నుంచి.. జనసేన రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూడడం సిగ్గుమాలిన చర్య అని తులసిరెడ్డి అన్నారు. జనసేన బీజేపీ రోడ్ మ్యాప్ అడగడం కంటే బీజేపీలో విలీనం చేస్తే మంచిదని ఎద్దేవాచేశారు. బీజేపీ, టీడీపీ, జనసేనలు కేంద్రం చేతులో కీలు బొమ్మలుగా మారాయని తులసిరెడ్డి అన్నారు.
Also read:Birbhum : బీర్ భూం ఘటనలో సంచలన విషయాలు, సజీవదహనం కంటే ముందు కొట్టారు ?
దేశంలో అన్ని ఉత్పత్తులపై రేట్లు పెంచిన బీజేపీ ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై మోపుతుందని తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జీడీపీ అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ అని..వాటి ధరలు అమాంతం పెంచేసిన బీజేపీ ప్రభుత్వం జనంపై మోయలేని భారం వేసిందని విమర్శించారు. గ్యాస్ ధరలు చూసి వంటింట్లోకి వెళ్లాలంటే మహిళలు భయపడి పోతున్నారని తులసిరెడ్డి అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరిగాయని సాకులు చెబుతూ ధరలు పెంచుతున్నారని..అయితే గతంలో కాంగ్రెస్ హయాంలోనూ అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరిగినా అప్పటి ప్రధాని మన్మోహన్ మాత్రం దేశంలో ధరలు పెంచలేదని ఈసందర్భంగా తులసిరెడ్డి గుర్తు చేశారు.
Also read:TDP MLC Nara Lokesh : తెలంగాణలో కొత్త పరిశ్రమలు వస్తున్నాయి.. ఏపీకి వచ్చాయా ? – నారా లోకేష్
ప్రజలు కూడా ఈ అన్యాయ పాలనపైన, దుర్మార్గపు రాజకీయ పార్టీల పట్ల ఆలోచన చేసి, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టాలని తులసిరెడ్డి అన్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై కార్యక్రమం మొదలైందని, ప్రజలు కాంగ్రెస్ పై నమ్మకం ఉంచి సభ్యత్వం తీసుకోవాలని తులసిరెడ్డి సూచించారు.
Also Read:TRS Protest : మోదీని ఇంటికి పంపే రోజులు దగ్గర పడ్డాయి – టీఆర్ఎస్