ఏపీలో మరో 9 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు ప్రకటన

విజయవాడ నుంచి వల్లూరు భార్గవ్ పోటీ చేయనున్నారు. విజయనగరం నుంచి బొబ్బిలి శ్రీను పోటీ చేస్తారు. 

ఏపీలో మరో 9 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు ప్రకటన

Congress

ఏపీలో మరో 9 లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. విజయవాడ నుంచి వల్లూరు భార్గవ్ పోటీ చేయనున్నారు. విజయనగరం నుంచి బొబ్బిలి శ్రీను పోటీ చేస్తారు. కాగా, ఇవాళ ఝార్ఖండ్ నుంచి పోటీ చేసే మరో ఇద్దరి పేర్లను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలు ఉన్న విషయం తెలిసిందే. మిగతా అభ్యర్థులను ఆ పార్టీ త్వరలోనే ప్రకటించనుంది. ఏపీలో ఇప్పటికే వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి.

ఆ తొమ్మిది మంది అభ్యర్థులు వీళ్లే..

  • శ్రీకాకుళం – పరమేశ్వరరావు
  • విజయనగరం -బొబ్బిలి శ్రీను
  • అమలాపురం- జంగా గౌతం
  • మచిలీపట్నం -గోళ్లు కృష్ణ
  • విజయవాడ -వల్లూరు భార్గవ్
  • ఒంగోలు- ఈడ సుధాకర్ రెడ్డి
  • నంద్యాల లక్ష్మీ నరసింహ యాదవ్
  • అనంతపూర్ – మల్లికార్జున్ వజ్జల
  • హిందూపూర్- సమాద్ షాహీన్

Uttam Kumar Reddy : కార్యకర్తల త్యాగం వల్లే కాంగ్రెస్ అధికారంలోకి.. ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలకు డిపాజిట్ రాదు : మంత్రి ఉత్తమ్