స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటి చేయించేందుకు.. అప్పటికప్పుడు మహిళతో నిశ్చితార్థం

  • Published By: veegamteam ,Published On : March 12, 2020 / 06:38 AM IST
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటి చేయించేందుకు.. అప్పటికప్పుడు మహిళతో నిశ్చితార్థం

Updated On : March 12, 2020 / 6:38 AM IST

ఏపీలోని కురిచేడు ఎంపీపీ పదవి ఓసీ మహిళకు రిజర్వ్‌ అయింది. కానీ పోటి చేయించేందుకు అర్హత కలిగిన మహిళ లేదు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయించేందుకు అప్పటికప్పుడు ఓ వ్యక్తి వేరే ఊరి మహిళతో నిశ్చితార్థం పెట్టుకున్నారు. బుధవారం 11న నామినేషన్ వేసేందుకు ఆఖరు తేదీ కావడంతో మంగళవారం రాత్రి యువతికి ఓ యువకుడితో నిశ్చితార్థమైంది. 

కాబోయే భర్త కుటుంబం తరుపున ఆమె పోటీకి సిద్ధమైంది. తాను ఎంపీపీ పదవి రేసులో ఉంటానని ఆ యువతి ఊహించి ఉండదు. అనుకోని విధంగా వరించిన ఈ అవకాశంతో ఆ యువతి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కురిచేడు ఎంపీపీ అభ్యర్థిగా వైసీపీ తరుపున యువతి బరిలోకి దిగుతోంది. 

వివరాల్లోకి వెళ్తే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కురిచేడు ఎంపీపీ పదవి ఓసీ మహిళకు రిజర్వ్‌ అయింది. వైసీపీ తరపున అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను దేకనకొండ గ్రామానికి చెందిన బెల్లం చంద్రశేఖర్‌కు అప్పగించారు. చంద్రశేఖర్‌కు ముగ్గురు కుమారులు కావడంతో తన భార్యను పోటీకి నిలిపే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయన తన పెద్దకుమారుడు సురేష్‌కు వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. గంగదొనకొండ గ్రామానికి చెందిన పార్శ్వపు వెంకటనర్సయ్య కుమార్తె శిరీషతో మంగళవారం రాత్రి అప్పటికప్పుడు నిశ్చితార్థం చేశారు. 

మార్చి 11వ తేదీతో ఎంపీటీసీ పదవులకు నామినేషన్‌ గడువు ముగియనుండటంతో తన కోడలిని బరిలోకి దించాలనే ఉద్దేశంతో ఈ వివాహం నిశ్చయించారు. తమ గ్రామానికి చెందిన ఎంపీటీసీ స్థానం ఇతర వర్గాలకు రిజర్వు కావడంతో కల్లూరు గ్రామ ఎంపీటీసీ అభ్యర్థిగా కాబోయే కోడలు పార్శ్వపు శిరీషతో బుధవారం నామినేషన్‌ వేయించారు.