వామ్మో కరోనా : ఏపీలో 303 కేసులు..కర్నూలులో అత్యధికం

  • Published By: madhu ,Published On : April 7, 2020 / 12:37 AM IST
వామ్మో కరోనా :  ఏపీలో 303 కేసులు..కర్నూలులో అత్యధికం

Updated On : April 7, 2020 / 12:37 AM IST

ఏపీలో కరోనా స్పీడుగా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కర్నూలు, నెల్లూరు, గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. 2020, ఏప్రిల్ 06వ తేదీ సోమవారం 24 గంటల వ్యవధితలో ఏకంగా 45 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 303 కి చేరాయి.

కర్నూలు జిల్లాలో కొత్తగా 18 కేసులు నమోదు కావడంతో జిల్లా వాసులు బిక్కు బిక్కుమంటు గడుపుతున్నారు. రెండు రోజుల వ్యవధిలో 70 కేసులు కొత్తగా నమోదు కావడంతో ఈ వైరస్ ఏ మేర వ్యాపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. 

రాష్ట్రంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు కొత్తగా నమోదైన కేసుల్లో నెల్లూరు జిల్లాలో 8, వెస్ట్ గోదావరి జిల్లాలో 6, విశాఖ పట్టణం 5, కడపలో 4, గుంటూరులో 2, ప్రకాశం, కృష్ణా జిల్లాలో ఒక్కో కేసులు నమోదయ్యాయి.(ఇండియాను వదలని కరోనా : 4 వేల 281 కేసులు..24 గంటల్లో 32 మంది మృతి)

కర్నూలు 74, నెల్లూరు 42, గుంటూరు 32 కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఏపీ ఏడో స్థానంలో కొనసాగుతోంది. మహారాష్ట్రలో అత్యధికంగా 781 కేసులు నమోదయ్యాయి. 

జిల్లాల వారీగా కేసులు :
* శ్రీకాకుళం 0. విజయనగరం 0. గుంటూరు 32. కృష్ణా 29. విశాఖపట్టణం 20. చిత్తూరు 17. తూర్పుగోదావరి 11. కడప 27. * కర్నూలు 74. * నెల్లూరు 42. * ప్రకాశం 24. పశ్చిమగోదావరి 21. అనంతపురం 6.