Andhra Pradesh : తూ.గో. జిల్లాలో అత్యధిక కరోనా కేసులు నమోదు
ఏపీలో కరోనా కేసులు అదుపులోకి వచ్చాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 42,679 పరీక్షలు నిర్వహించగా.. 839 మందికి పాజిటివ్ గా నిర్దారణ అయింది.

Andhra pradesh
Andhra Pradesh : ఏపీలో కరోనా కేసులు అదుపులోకి వచ్చాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 42,679 పరీక్షలు నిర్వహించగా.. 839 మందికి పాజిటివ్ గా నిర్దారణ అయింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 20,39,529కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల ఎనిమిది మంది మృతి చెందారు. కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,078కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,142 మంది బాధితులు కోలుకొని ఇళ్లకు వెళ్లారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య 20,11,063కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,388 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,77,63,761 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
Read More : Raj Kundra: అశ్లీల చిత్రాల కేసులో రాజ్ కుంద్రాకు బెయిల్ మంజూరు
జిల్లాల వారీగా నమోదైన కేసులను ఒకసారి పరిశీలిస్తే
అనంతపురం – 1, చిత్తూరు – 101, తూర్పుగోదావరి – 231, గుంటూరు – 75, కడప – 76, కృష్ణా – 36, కర్నూలు – 4, నెల్లూరు – 149,ప్రకాశం – 101, శ్రీకాకుళం – 5, విశాఖపట్నం – 47, విజయనగరం – 0, పశ్చిమ గోదావరి – 13,
Read More : UN Warn : మహా ముప్పు అంచున భూగోళం : ఐక్యరాజ్యసమితి హెచ్చరిక
మృతులు
గుంటూరు – 2, కృష్ణా – 2, చిత్తూరు – 1, తూర్పుగోదావరి – 1, ప్రకాశం – 1, పశ్చిమ గోదావరి – 1