ఏపీ సచివాలయంలో కరోనా కలవరం.. 27కు చేరిన పాజిటివ్ కేసులు

  • Published By: bheemraj ,Published On : July 2, 2020 / 06:51 PM IST
ఏపీ సచివాలయంలో కరోనా కలవరం.. 27కు చేరిన పాజిటివ్ కేసులు

Updated On : July 2, 2020 / 6:58 PM IST

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా వైరస్ కలవర పెడుతోంది. సచివాలయంలో కరోనా కేసుల సంఖ్య 27కు చేరింది. తాజాగా మరో 10 మంది వైరస్ బారిన పడ్డారు. గత నెల 25న సచివాలయ ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించగా వీరిలో 10 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. దీంతో మెజారిటీ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయాలని అధికారులు ఆదేశించారు.

ఏపీలో కరోనా కేసులు 16 వేలు దాటాయి. ఏపీలో కొత్తగా 845 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వైరస్ సోకి ఐదుగురు మృతి చెందారు. ఏపీలో 812, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 29 మందికి కరోనా సోకింది. విదేశాల నుంచి వచ్చిన మరో నలుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరో 281 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఏపీలో మొత్తం 16,097 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనా బారిన పడి 198 మంది మృతి చెందారు. రాష్ట్రంలో 8,586 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 7,313 మంది కరోనా బాధితులు కోలుకుని, డిశ్చార్జ్ అయ్యారు.

అనంతపురం, గుంటూరు, కడప జిల్లాలో వందకు పైగా కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. అనంతపురంలో శరవేగంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల్లో 14, 285 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు ఏపీలో మొత్తం కరోనా కేసులు 16,097కు చేరాయి.