విశాఖ సెంట్రల్ జైల్లో 27 మంది ఖైదీలతోపాటు 10 మంది అధికారులు, సిబ్బందికి కరోనా

  • Published By: bheemraj ,Published On : July 30, 2020 / 03:45 PM IST
విశాఖ సెంట్రల్ జైల్లో 27 మంది ఖైదీలతోపాటు 10 మంది అధికారులు, సిబ్బందికి కరోనా

Updated On : July 30, 2020 / 3:57 PM IST

ఏపీ జైళ్లకు కరోనా సెగ పాకింది. విశాఖ సెంట్రల్ జైలులో కరోనా కలకలం రేపింది. శిక్ష ఖరారైన 27 మంది ఖైదీలతోపాటు 10 మంది అధికారులు, సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అనారోగ్యంతో కేజీహెచ్ లో చేరిన మొద్దు శీను హంతకుడు ఓం ప్రకాశ్ మృతి చెందాడు. ఓ ప్రకాశ్ మృతదేహానికి టెస్టు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో కంగారు పడ్డ జైలు అధికారులు జైల్లోని అధికారులకు ఖైదీలకు టెస్టులు చేశారు.

వీరిలో మొత్తం 27 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. మిగతా వాళ్లందరికీ టెస్టులు చేయాలని జైలు అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే జైల్లో అందరికీ టెస్టులు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఖైదీలకు కరోనా సోకడంతో కుటుంబ సభ్యులలో ఆందోళన వ్యక్తం అవుతుంది.

విశాఖ సెంట్రల్ జైలులో కరోనా కలవరం పెడుతోంది. ఇప్పటికే సెంట్రల్ జైలులో 27 మంది శిక్ష ఖరారైన ఖైదీలకు పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో ఒక్కసారిగా సిబ్బంది అంతా వణికిపోతున్నరారు. ముఖ్యంగా కేజీహెచ్ లో కిడ్నీ వ్యాధితో మృతి చెందిన ఓంప్రకాంశ్ మృతదేహానిక కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జైలులో ఉన్న ఖైదీల్లో కొంతమందికి అంటే ఓం ప్రకాశ్ కు దగ్గరగా కాంటాక్టు ఉన్న వారికి కరోనా పరీక్షలు చేసినప్పుడు వారికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

దీంతో ఇటు కేజీహెచ్ లో ఉన్న ఖైదీలతోపాటు మిగత వారందరికీ టెస్టులు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ముఖ్యంగా కరోనా వైరస్ బారిన పడుతున్న నేపథ్యంలోనే జైలులో ఏడు సంవత్సరాల లోపు తక్కువ వ్యవధిలో ఉన్న శిక్ష అనుభవిస్తున్న ఖైదీలందరినీ విడుదల చేశారు. విడుదల చేసినా తర్వాత కరోనా సోకకుండా ఉండేందుకు ప్రికాషన్స్ తీసుకున్నారు.

ఎక్కువ మంది జైలులో ఉండకుండా సంఖ్యను కూడా బాగా తగ్గించారు. ఐదుగురు, ఆరుగురు ఉండే గదిలో ముగ్గురు లేదా ఇద్దరినే ఉంచుతున్నారు. అయినప్పటికీ కరోనా వైరస్ జైలులో ఉన్న ఖైదీలను వదలడం లేదు. అక్కడంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు చేయాలని నిర్ధారించారు.

ముఖ్యంగా జైలు సిబ్బందికి సంబంధించి ఎవరైతే ఉన్నారో సిబ్బంది మొత్తం కూడా కరోనా పరీక్షలు చేయాలని జైళ్ల శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే జైళ్లల్లో ఉన్న ఖైదీలతోపాటు అక్కడున్న సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు చేయనున్నారు. రీసెంట్ జరిగిన నేరాలకు సంబంధించి ఎవరైన ఖైదీలు లోపలికి వచ్చేందుంటే వారికి నెగెటివ్ ఉంటేనే లోపలికి అనుమతించేలా కూడా నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోంది.