వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలియజేశారు. చాలా మంది ఫోన్లు చేస్తున్నారిన..ఎవరు కూడా తనకు ఫోన్ చేయొద్దని కోరారు. ఐసోలేషన్ లో ఉన్నానని, ఆస్పత్రిలో కరోనా చికిత్స తీసుకునే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. ధైర్యంగా, ఆరోగ్యంగా ఉన్నానని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని క్షేమంగా తిరిగొస్తానని చెప్పారు.
తనకు చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు. రిసీవ్ చేసుకోలేకపోతున్నాను. కారణమేంటంటే తాను ఐసోలేషన్ లో ఉన్నాను. తనను కాంటాక్టు కావాలని తన ఫోన్ కు ట్రై చేయొద్దన్నారు. తనకు ఫోన్ చేసే అందరికీ ఆన్సర్ చేయను…చాలా మందికి సమాధానం చెప్పడం కన్నా ఒకసారి వీడియో తీసి పంపడం బెటర్ అనే ఉద్దేశ్యంతో తాను ఈ వీడియో చేస్తున్నానని తెలిపారు.
తనకు కరోనా పాజిటివ్ అని మార్నింగ్ తెలిసిందన్నారు. ఆర్ టీపీసీ టెస్టుల్లో తెలిందని తెలిపారు. చికిత్స చేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నానని వెల్లడించారు. బయటికి కచ్చితంగా వస్తానని.. ఎలాంటి భయాందోళన లేదన్నారు.