ఏపీలో కరోనా అప్‌డేట్: 2,671కి చేరిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తూనే ఉంది. కరోనా కేసుల ఉధృతి ఏమాత్రం తగ్గట్లేదు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా… కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ నెల మొదటి రెండు వారాల పాటు చాలా తక్కువ సంఖ్యలో నమోదైన కేసులు మళ్లీ పెరిగిపోయాయి.
ఇవాళ(2020, మే 25వ తేదీ) 10,240 శాంపిళ్లను పరీక్షించగా మరో 44 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇదే సమయంలో 41 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది.రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 2,671కు చేరకోగా.. ఆసుపత్రుల్లో 767మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 1,848 మంది డిశ్చార్జ్ అవగా.. మృతుల సంఖ్య 56కి చేరుకుంది.