కరోనా..దేవుడా : ఖాళీగా గుళ్లు..చిల్కూరు బాలాజీ టెంపుల్ మూసివేత

  • Published By: madhu ,Published On : March 19, 2020 / 06:16 AM IST
కరోనా..దేవుడా : ఖాళీగా గుళ్లు..చిల్కూరు బాలాజీ టెంపుల్ మూసివేత

Updated On : March 19, 2020 / 6:16 AM IST

కరోనా..కరోనా..ఎక్కడ చూసినా ఇదే చర్చ. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ప్రతి రంగంపై ఈ వైరస్ ఎఫెక్ట్ పడిపోయింది. ఆర్థిక రంగంపై ప్రభావం చూపెడుతోంది. ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నారు. దేవుడిపై కూడా దీని ఎపెక్ట్ పడిపోయింది. గుళ్లకు వెళ్లాలంటేనే..వెనుకడుగు వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి నెలకొంది. ప్రముఖ దేవాలయాల్లో రద్దీ తగ్గిపోయింది.

భక్తులు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. తిరుమలలో పలు ఆంక్షలు విధించింది టీటీడీ. ఆర్జిత సేవలను కూడా రద్దు చేసిన సంగతి తెలిసిందే. క్యూ లైన్ లేకుండానే..నేరుగా దర్శనాన్ని కల్పిస్తున్నారు. నిత్యం భక్తులతో కిటకిటలాడే శ్రీకాళాహస్తి, కాణిపాకం దేవాలయాలు భక్తులు లేక వెలవెలబోతున్నాయి. కొద్ది మంది భక్తలు మాత్రమే వస్తున్నారని, దీంతో తమ వ్యాపారాలు సాగడం లేదంటున్నారు కొంతమంది వ్యాపారస్తులు.

See Also | 10వ తరగతి పరీక్షలు.. మాస్కులతో హాజరైన విద్యార్థులు

అన్నదానం, రాహుకేతులు పూజలు చేయించుకొనే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని అంటున్నారు ఆలయ అధికారులు. శని, ఆది, సోమవారాల్లో శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి భారీగా భక్తులు వస్తుంటారు. కానీ ప్రస్తుతం అలాంటి సీన్ కనిపించడం లేదు. వచ్చిన కొద్ది మంది భక్తులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖానికి మాస్క్‌లు ధరించి వస్తున్నారు. నగరంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన చిల్కూరు బాలాజీ టెంపుల్‌ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. 

ఇంద్రకీలాదిపై అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, బాసర, ధర్మపురి, ఇతర ఆలయాలు బోసిపోతున్నాయి.  
కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ప్రదేశాలను సందర్శించకుండా ఉండాలని అధికారులే స్వయంగా సూచనలిస్తున్నారు. మహారాష్ట్రలో అధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో షిర్డీ ఆలయాన్ని మూసివేశారు. దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. 

Read More ; దిమ్మ తిరిగిపోయే స్కెచ్ వేసిన కేసీఆర్ : KTR CM అవుతారని ప్రచారం