ఏపీ @ 757.. 24 గంటల్లో 35 కొత్త కరోనా పాజిటివ్ కేసులు 

  • Published By: sreehari ,Published On : April 21, 2020 / 06:53 AM IST
ఏపీ @ 757.. 24 గంటల్లో 35 కొత్త కరోనా పాజిటివ్ కేసులు 

Updated On : April 21, 2020 / 6:53 AM IST

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 757కు చేరింది. ఏపీలో ఇప్పటివరకూ కరోనాతో 22 మంది మృతిచెందారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 639 మంది ఉండగా, 96 మంది నెగటివ్ రావడంతో డిశ్చార్జీ అయ్యారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 35 కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం ( ఏప్రిల్ 21) రోజే కర్నూల్ 10, గుంటూరు 9, కడప 6, పశ్చిమ గోదావరి 4, అనంతపురం 3, కృష్ణాలో 3 కేసులు నమోదయ్యాయి.

కర్నూలు జిల్లాల్లో అత్యధికంగా 184 కేసులు నమోదయ్యాయి. GGH నెల్లూరు జిల్లాలో పాజిటివ్ గా నిర్ధారించిన ఒక కేసు ప్రకాశానికి చెందినది. ఈ కేసును ప్రకాశం జిల్లాకు బదిలీ చేశారు. నెల్లూరులోనే ట్రీట్ మెంట్ జరుగుతోంది. నెల్లూరు యాక్టివ్ కేసుగా పరిగణించారు. 

కొవిడ్-19 పరీక్షల వివరాలు :
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో (9AM-9AM) 5022 శాంపిల్స్ పరీక్షించగా 35 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారించారు. 

కొత్తగా డిశ్చార్జి అయిన వారి వివరాలు :
* గడిచిన 24 గంటల్లో నలుగురు కొవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి చేశారు. వీరిలో కర్నూల్ నుంచి ముగ్గురు, నెల్లూరు నుంచి ఒకరు డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జీ అయిన వారి సంఖ్య 96కు చేరింది. 

కొత్తగా నమోదైన మరణాలు :
రాష్ట్రంలో కొత్తగా గుంటూరు జిల్లాలో కరోనాతో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మరణించినవారి సంఖ్య 22కి చేరింది.